YCP Ministers : సీటుపై నో క్లారిటీ .. మంత్రులనూ టెన్షన్ పెడుతున్న జగన్ 

విడతలు వారీగా ప్రకటించిన వైసిపి అభ్యర్థుల జాబితాలో మొత్తం 69 మంది సిట్టింగులను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మార్చారు.ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యే అభ్యర్థిగాను, ఎమ్మెల్యే లకు ఎంపీ అభ్యర్థులుగాను మార్పు చేర్పులు చేపట్టారు.

 Ycp Ministers : సీటుపై నో క్లారిటీ .. మంత�-TeluguStop.com

ఇక సాధారణ కార్యకర్తలకు, జెడ్పిటీసి లకు సైతం సీట్లు కేటాయించి అందరిని ఆశ్చర్యపరిచారు.అయితే ఈ మార్పు చేర్పుల్లో జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు, కీలక నేతలను సైతం జగన్ పక్కన పెట్టారు.

ఇక ఇప్పటికే ఆరు విడతలుగా అభ్యర్థుల జాబితా ప్రకటించడం తో ఇంకా మరో మూడు జాబితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు వైసిపి లోని( YCP ) కీలకవర్గాలు పేర్కొంటున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Ap Ministers, Botsa Jhansi, Cmjagan, Jagan, Rajanna Dora

ఇంతవరకు బాగానే ఉన్నా.  ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిలో చాలామందికి జగన్ ఏ క్లారిటీ ఇవ్వకపోవడంతో, వారు తమకు సీటు దక్కుతుందా లేదా అనే టెన్షన్ లో ఉన్నారు ప్రస్తుత మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను జగన్ ప్రకటించారు.దీంతో కొంతమంది తమకు ఎంపీలుగా అవకాశం ఇస్తారని ఆశలు పెట్టుకోగా, మరికొంతమంది తమకు సీటు లేనట్లేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మంత్రులు గుడివాడ అమర్నాథ్,( Gudivada Amarnath ) విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, ఆర్కే రోజా,( RK Roja ) సిదిరి అప్పలరాజు,

Telugu Ap Cm Jagan, Ap, Ap Ministers, Botsa Jhansi, Cmjagan, Jagan, Rajanna Dora

కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు,( Ambati Rambabu ) బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి, దాడిశెట్టి రాజా, కాకాని గోవర్ధన్, రాజన్న దొర వంటి వారు సీటు విషయంలో టెన్షన్ పడుతున్నారు.మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా భరత్( Bharat ) అనే యువకుడు కి జగన్ సీటు కేటాయించారు.దీంతో తనను విశాఖ ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటిస్తారని అమర్నాథ్ భావించినా, అక్కడ బొత్స ఝాన్సీ( Botsa Jhansi ) పేరు వినిపిస్తుండడంతో, తనకు అవకాశం ఉంటుందా లేదా అనే విషయంలో అమర్నాథ్ టెన్షన్ పడుతున్నారు.ఇక మంత్రి గుమ్మనూరు జయరాం( Minister Gummanur Jayaram ) పరిస్థితి ఇదేవిధంగా ఉంది.

Telugu Ap Cm Jagan, Ap, Ap Ministers, Botsa Jhansi, Cmjagan, Jagan, Rajanna Dora

ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జయరాం స్థానంలో జెడ్పిటీసి విరూపాక్షకు ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు.జయరాం ను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సూచించారు దీంతో జయరాం అసంతృప్తితో ఉంటూ బళ్లారిలోనే ఉంటూ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.ఇక మంత్రులు రోజా, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు లు వారి వారి నియోజకవర్గాల్లోనే పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత ఎదుర్కుంటూ ఉండడం తో వారికి వేరే చోట సర్దుబాటు చేస్తారా లేదా అనేది కూడా తేలేకపోవడం తో వీరిలో మరింతగా టెన్షన్ పెరిగిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube