అమెరికాలో తెలుగు ఆణిముత్యం...

అమెరికాలో మన తెలుగువారి ప్రతిభకి పోటీ లేదు.తెలివితేటల్లో మనవాళ్ళు ఎప్పుడో సంద్ర్రాలు దాటేశారు.

 Nikhil Reddys Great Invent Is Instapark App-TeluguStop.com

అందులో భాగంగానే మనవారి ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో అవార్డులు వరిస్తుంటాయి.తాజాగా ఓ తెలుగు యువకుడికి అగ్ర రాజ్యంలో అరుదైన అవార్డ్ సొంత అయ్యింది.

ఇంతకీ మనవాడు ఏమి చేశాడో ఓ లుక్కేయండి.తెలుగు రాష్ట్రాలకి చెందిన మెట్టుపల్లి సాయి నిఖిల్ రెడ్డి అమెరికాలో

అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.పార్కింగ్‌ సమస్యలకు పరిష్కారాన్ని గుర్తించే క్రమంలో అతడు క్రమసూత్ర పద్ధతి ని రూపొందించాడు.పార్కింగ్‌ ప్రదేశంలోకి ప్రవేశించిన వెంటనే ఖాళీ జాగా ఎక్కడుందో గుర్తించగలగడమే సమస్యకు పరిష్కారమని సాయి ఆ సూత్రాన్ని ప్రతిపాదించాడు…దాంతో ‘2018 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఓపెన్‌హౌస్‌’ పోటీల్లో రెండో బహుమతిని సాధించాడు.

నిఖిల్‌రెడ్డి డ్రైవర్లు ఖాళీగా ఉండే పార్కింగ్‌ ప్రదేశంలోకి నేరుగా వెళ్లిపోయేలా ‘ఇన్‌స్టాపార్క్‌’ అనే మొబైల్‌ యాప్‌ను సాయి అభివృద్ధి చేస్తున్నాడు…ఈ యాప్ లో జీపీఎస్‌ ద్వారా పార్కింగ్‌ ప్రదేశంలోని ఖాళీ ప్రదేశాలు ,కార్లతో నిండిపోయిన ప్రదేశాల గ్రిడ్‌ లేఅవుట్‌ కనిపిస్తుంది.దాంతో వాహనదారుడు పార్కింగ్ సమయంలో వెతుక్కునే పనిలేకుండానే ఈ యాప్ ద్వారా సులభంగా కాళీ జాగాని చూసుకుంటాడు.అయితే ఈ యాప్ ని రూపొందించే క్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్ వినీతా మెనన్‌ ఏంతో సహకరిస్తున్నారని తెలిపాడు నిఖిల్ రెడ్డి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube