దేశంలోనే అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల్లో నేను ఒకడిని అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో పడనుందా.?? ఏపీ ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరా.?? తాజా పరిస్థితిపై సర్వేలు చేయించుకున్న ప్రభుత్వానికి దిమ్మదిరిగే షాక్ ఏపీ ప్రజలు ఇచ్చారా.?? సుదీర్ఘమైన చంద్రబాబు రాజకీయ జీవితానికి అతి త్వరలోనే పులిస్టాప్ పడనుందా.అంటే అవుననే సమాధానం వస్తోందని తెలుస్తోంది.ఇంటెలిజెన్స్ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం సంచలన విషయాలు పడ్డాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.వివరాలలోకి వెళ్తే…
చంద్రబాబు నాయుడు పరిస్థితి నానాటికీ దిగజారుతున్న టు కనిపిస్తోందని ఏపీ ప్రజలు చంద్రబాబు పాలనపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారని అనుభవం ఉన్న నాయకుడు అయిన ఈసారి చంద్రబాబుకు పట్టం కట్టే పరిస్థితి లేదని ఇంటెలిజెంట్ సర్వేలో తేలిపోయిందట.ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కోడి కత్తి దాడి ఘటనని తమకి అనుకూలంగా మార్చుకుందామని అనుకున్న చంద్రబాబు ప్రభుత్వ ఆరోపణలని ప్రజలు ఏ మాత్రం నమ్మలేదని తెలుస్తోంది.ఈ విషయంలో చంద్రబాబు చుట్టూ ఉండే నేతలు మాట్లాడిన తీరు తెన్నులు జగన్ పై దాడి జరిగిన ఘటనలో తెలుగుదేశం పాత్ర ఉందా అనే అనుమానాలు రేకెత్తించి విధంగా ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు గా తెలుస్తోంది.ఒక తెలుగుదేశం నేత క్యాంటీన్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి దాడి చేసిన అంశాన్ని వైసిపి పైనే రుద్దుకోవడం ప్రజలు ఏమాత్రం నమ్మ లేదట.
తెలుగుదేశం పార్టీ నేతలు టీవీ చర్చా కార్యక్రమాలలో జగన్ కావాలనే సానుభూతి కోసం కత్తితో విడిపించుకున్నాడు అనే వ్యాఖ్యలు చేయడం ప్రజలకు ఏమాత్రం రుచించలేదు కావాలనే టీడీపీ నేతలు జగన్ పై ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉందని దాంతో ఏదైతే సానుభూతి అంశాన్ని తెలుగుదేశం తెరపైకి తీసుకువచ్చిందో ఇప్పుడు అదే సానుభూతి జగన్మోహన్ రెడ్డికి వెల్లువలా వస్తోందని బాబు సర్వే ప్రకారం తేలిందట దాంతో షాక్ తిన్న చంద్రబాబు తన నేతలకు ఎమ్మెల్యేలకు భారీగా క్లాస్ తీసుకున్నారు అని కూడా టాక్ వినిపిస్తోంది.మీ వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డికి మరింత ఆదరణ వస్తోంది తప్ప ఏ మాత్రం తగ్గడం లేదని మనకే లాభం రాకపోగా పార్టీకి తీవ్ర నష్టం మీ వల్ల కలుగుతుందని బాబు కళ్ళెర్ర చేశారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జగన్ పై దాడి ఘటన నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన పరిణామాలను బేరీజు వేస్తూ చంద్రబాబు చేయించిన ఈ సర్వేలో బాబుకు ప్రతికూలంగా రిజల్ట్ రావడంతో ఈ అంశాన్ని మెల్లగా పక్కకు పెట్టి స్పెషల్ స్టేటస్ అంశంపై దృష్టి పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది.గతంలో స్పెషల్ స్టేటస్ విషయంలో తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఎలాగైతే నిరసనలు తెలిపారు ఇప్పుడు అదే విధమైన సరికొత్త ప్రణాళికలు రూపొందించి ఏపీ ప్రజల దృష్టిని మరల్చేలా బాబు మోహన్ పన్నుతున్నారని తెలుస్తోంది.