తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ప్రస్తుతం ఆయన ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రజనీకాంత్ పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియో పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు దారుణంగా ట్రోలింగ్స్( Trolls ) చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.ఒక గుడికి వెళ్లిన రజినీకాంత్ దైవ దర్శనం( Rajinikanth Visit to Temple ) తర్వాత తన చొక్కా మడతలో నుంచి డబ్బులు తీసి దక్షిణ వేశారు.ఇలా ఒక తలైవర్ మాత్రమే చేయగలరు అంటూ కొందరు వీడియోను షేర్ చేస్తున్నారు.
అయితే కొందరు నెటిజన్స్ మాత్రం రజినీకాంత్ ఇలా చేస్తారు? అని అంటున్నారు.దానికి రజినీ వేసుకున్న షర్ట్‌కి జేబు లేదు.అందుకనే ఆయన చొక్కా చేతి మడతలో డబ్బులు తీసుకుని వచ్చి దక్షిణ వేశారని ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు.80లలో అంతకు ముందున్నవారు చాలా మంది ఇలా మడతల్లో డబ్బులు పెట్టుకునేవారని దీనిపై కామెంట్స్ చేయటం సరికాదని కూడా అనేవారు లేకపోలేదు.
ఇటీవల జైలర్ సినిమా( Jailer )తో మంచి సక్సెస్ ను అందుకున్న రజనీకాంత్ అదే ఊపుతో ఇప్పుడు 170 సినిమా కోసం సిద్ధమవుతున్నారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాను జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నారు.ఇందులో రజినీకాంత్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి తోపాటు మంజు వారియర్ కూడా నటించబోతున్నారు.