ప్రస్తుత సమాజంలో కొంత మంది మృగాళ్లు వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు.వరసకి మేనత్త అయినటువంటి మహిళపై అత్యాచారం చేసిన యువకుడికి కోర్టు పది సంవత్సరాలు తెలుగు శిక్ష విధించింన ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే 2017వ సంవత్సరంలో రాష్ట్రంలోని బాలేశ్వర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇ హోటల్ దాబా నడిపేవాడు.అయితే అతడికి సాయంగా ఉండడం కోసం తన మేనల్లుడు వరసయ్యే యువకుడిని తన దగ్గరే పనిలో పెట్టుకున్నాడు.
దీంతో ఆ యువకుడు భార్యాభర్తలు ఉంటున్న ఇంట్లోనే ఉండేవాడు.అయితే తన మేనత్త పై కన్నేసిన యువకుడు ఆమెపై కామవాంఛలు పెంచుకున్నాడు.ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను లొంగ తీసుకోవాలని పలు వికృత చేష్టలకి పాల్పడేవాడు.అయితే యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె తను నేను నీకు మేనత్తను అవుతానని తనతో ఇలా ప్రవర్తించ కూడదని ఇది చాలా తప్పు అని చెప్పేది.
అయితే ఎన్నిసార్లు చెప్పినా ఆ యువకుడు మాత్రం అం తన బుద్ధి మార్చుకోకుండా అలాగే ప్రవర్తిస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో ఒక రోజున ఇంట్లో ఆమె ఒక్కత్తే ఒంటరి గా ఉండటం తో ఇదే అదునుగా చేసుకున్న యువకుడు ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు అనంతరం ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.దీంతో ఆ యువతి భర్త కూడా చెప్పకుండా తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తుండేది. అయితే 2017 ఏప్రిల్ 5వ తారీఖున మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆ మహిళ విషయం తాగింది.
ఇది గమనించిన ఆమె భర్త ఆమెను దగ్గర్లో ఉన్న ఒక ఆసుపత్రికి చికిత్స తీసుకెళ్లగా అక్కడ ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందింది.
దీంతో తన మేనల్లుడు పై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.దాంతో నేడు ఈ కేసుకు సంబంధించిన నిందితుడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష అలాగే 7వేల రూపాయలు జరిమానా విధించింది.
అలాగే జరిమానా కట్ట లేనిపక్షంలో మరో పదేళ్లు జైలుశిక్ష అమలు చేయాలని అని కోర్టు తీర్పు ఇచ్చింది.