టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈరోజు నితిన్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా ఎం.
ఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది.అయితే ఈ సినిమా డైరెక్టర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు వివాదాస్పమైన సంగతి తెలిసిందే.
ఆ ట్వీట్లు తను చేయలేదని వైరల్ అయిన ట్వీట్లు ఫేక్ ట్వీట్లు అని దర్శకుడు వివరణ ఇచ్చినా ఆ వివాదం మాత్రమే కొనసాగుతోంది.ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఈ డైరెక్టర్ ట్వీట్లు చేశాడనే ఆరోపణల వల్ల కొంతమంది ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.
అమెరికాలో ప్రీమియర్ షోస్ ప్రదర్శితం కాకముందే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్ టాక్ వైరల్ కావడం గమనార్హం.
ఈ సినిమా హిట్ కాకూడదనే ఆలోచనతో కొంతమంది చేస్తున్న నెగిటివ్ ప్రచారం వల్ల ఈ సినిమాకు మేలు జరుగుతుందో నెగిటివ్ గా జరుగుతుందో చూడాల్సి ఉంది.
మాచర్ల నియోజకవర్గం నితిన్ వన్ మ్యాన్ షో అని క్లైమాక్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని కామెడీ లేకపోవడం, లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.నితిన్ అభిమానులకు, ఏ మాత్రం అంచనాలు పెట్టుకోకుండా సినిమా చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.మరోవైపు యూఎస్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయని సమాచారం అందుతోంది.