ప్రభాస్ క్రేజ్ చూసి హీరో అయ్యాను.. వైరల్ అవుతున్న నవీన్ చంద్ర క్రేజీ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సెలబ్రిటీలు, స్టార్ హీరోలు సైతం ప్రభాస్ ను ఎంతగానో అభిమానిస్తారు.

 Naveen Chandra Crazy Comments About Prabhas Details Here Goes Viral In Social Me-TeluguStop.com

ప్రభాస్ ప్రమోషన్స్ కు హాజరు కాకపోయినా సలార్ 700 కోట్ల రూపాయల( 700 crore rupees ) గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో సులువుగనఏ అర్థమవుతుంది.ప్రభాస్ క్రేజ్ గురించి నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ చంద్ర( Naveen Chandra ) ఈ విషయాలను వెల్లడించారు.భీమవరంలో వర్షం మూవీ 50 రోజుల ఈవెంట్ జరిగిందని ఆ ఈవెంట్ లో సాంగ్ పర్ఫామెన్స్ చేయడం కోసం నేను వెళ్లానని నవీన్ చంద్ర పేర్కొన్నారు.

వర్షం సినిమా సమయానికి ప్రభాస్ కేవలం 4, 5 సినిమాల్లో మాత్రమే హీరోగా చేసినా ఆ సినిమా ఫంక్షన్ కు దాదాపుగా 6 లక్షల మంది వచ్చారని నవీన్ చంద్ర పేర్కొన్నారు.

Telugu Crore Rupees, Kalki, Naveen Chandra, Naveenchandra, Prabhas, Tollywood-Mo

ప్రభాస్ ను చూసి తాను సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యానని నవీన్ చంద్ర వెల్లడించారు.ప్రభాస్ కు అప్పట్లోనే ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఇప్పుడు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో( Kalki ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి అప్ డేట్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.

Telugu Crore Rupees, Kalki, Naveen Chandra, Naveenchandra, Prabhas, Tollywood-Mo

కల్కి సినిమాకు సంబంధించి అధికారికంగా ఎప్పుడు అప్ డేట్ వస్తుందో చూడాలి.కల్కి సినిమా నుంచి టీజర్, ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కల్కి సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కల్కి విడుదలైతే ప్రభాస్ తర్వాత సినిమాల అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube