మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి( Renuka Chowdary ) రాజ్యసభ సభ్యురాలిగా( Rajya Sabha Member ) ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణ లో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్న సంగతి తెలిసిందే.
కాగా మూడో సారి రాజ్యసభ ఎంపీగా రేణుకా చౌదరి బాధ్యతలు స్వీకరించారు.
అయితే తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.
కాగా కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav ) ఎన్నిక కాగా.బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర పెద్దల సభకు ఎన్నికయ్యారు.







