అమరావతి రాజధాని మార్పుతో అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు.అక్కడ మహిళల ఆక్రందనలపై నాట్స్ విచారం వ్యక్తం చేసింది.
అనేక సేవా కార్యక్రమాలతో ఇటు అమెరికాలో కానీ.అటు తెలుగు రాష్ట్రాల్లో కానీ.
తెలుగువారికి ఏ కష్టమోచ్చినా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కచ్చితంగా స్పందిస్తూనే వస్తుంది.ఈ క్రమంలోనే అమరావతి ప్రాంతంలో మహిళలపై, వృద్ధులపై పోలీసుల చర్యలను నాట్స్ ఖండిస్తున్నట్టు ప్రకటించింది.
న్యూజెర్సీలో తెలుగు మీడియాతో మాట్లాడిన నాట్స్ నాయకత్వంఅమరావతి లో జరిగిన పోలీసుల దాడిని ఖండించింది.మానవతాదృక్పథం ఉన్న ప్రతి ఒక్కరూ సామాన్యులపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా పరగణించాలని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని అన్నారు.
పోలీసుల దమనకాండను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు గవర్నర్, రాష్ట్రపతి కూడాఖండించాలని.తక్షణం మహిళలపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళలు, వృద్ధులు, పిల్లలపై పోలీస్ చర్య తమను ఎంతగానో బాధించిందని శ్రీథర్ అప్పసాని తెలిపారు.ప్రభుత్వాలు ఏ నిర్ణయాలైనాతీసుకోవచ్చు.
కానీ అమాయకులైన మహిళ ల మీద పోలీసుల బలప్రయోగం అనేది యావత్ మానవతా వాదులుఖండించాల్సిన విషయమన్నారు.
నాట్స్ ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేని సేవా సంస్థ.
తెలుగుప్రజల పక్షమే తప్ప.ఏ పార్టీ పక్షం వహించదని కూడామేం స్పష్టం చేస్తున్నాం.
ప్రజాస్వామ్యంలో తమ గొంతు వినిపించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందనే విషయాన్నిపాలకులు విస్మరించరాదని నాట్స్డైరెక్టర్ హరినాథ్ బుంగతావుల, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి పేర్కొన్నారు.తమ ఆశలుసమాధి అవుతున్నాయన్న ఆందోళనలో ఉన్న మహిళలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.ఈ దిశగాప్రభుత్వం ఆలోచించాలని నాట్స్ కోరుకుంటుందన్నారు.ప్రభుత్వాల నిర్ణయాలకు సామాన్య మహిళలు, ప్రజలుబలిపశువులు కాకుండా చూడాలనేదే నాట్స్ నిశ్చితాభిప్రాయమని తెలిపారు.