'హాయ్ నాన్న' ప్రమోషన్స్ స్టార్ట్.. నాని, మృణాల్ ఇంటర్వ్యూ?

దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.మరి ఇదే ఊపులో నెక్స్ట్ సినిమాలను సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

 Nani Mrunal Hi Nanna Promotions Set To Begin, Nani30, Nani, Shouryuv, Mrunal Tha-TeluguStop.com

నాని ప్రస్తుతం ”హాయ్ నాన్న”( Hi Nana ) చేస్తున్నాడు.ఇది తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసినప్పుడే అంచనాలు పెరిగి పోయాయి.ఆ తర్వాత వెంటనే రెండు సాంగ్స్ రిలీజ్ చెయ్యగా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండి ఆడియెన్స్ ను ఆకట్టుకుని ఈ సినిమాపై నాని( Nani ) ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా హోప్స్ పెంచేసాయి.అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.తాజాగా మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు.

నాని, మృణాల్ కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫోటోలను రిలీజ్ చేస్తూ ఫుల్ ఇంటర్వ్యూ అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు.దీంతో ఈ స్పెషల్ ఇంటర్వ్యూతో ప్రమోషన్స్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషిస్తుండగా వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube