అప్పటి వరకు ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం చేయని ఒక డైరెక్టర్ తను తీయబోయే సినిమాలో తన ఫ్రెండ్ ని హీరోగా పెట్టుకుంటాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ? ఏ నిర్మాత అయిన అలాంటి డైరెక్టర్ తో కలిసి పనిచేయడానికి సిద్ధపడతారా ? పైగా ఆమె లేడీ డైరెక్టర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంటుందా ? ఖచ్చితంగా ఆ సినిమా పట్టాలెక్కే సమస్య ఉండదు.కానీ అన్ని అవరోధాలు దాటి తన సినిమాలో తన ఫ్రెండ్ ని హీరోగా పెట్టుకుని దర్శకురాలు నందిని రెడ్డి ఒక ఘనవిజయాన్ని సాధించారు అది మరి ఏదో కాదు “అలా మొదలైంది” అనే చిత్రం.
( Ala modalaindi ) ఆ సినిమాలో నానిని తప్ప మరొకరిని ఊహించుకోలేనని నాని కోసమే ఆ కథ రాసానని గట్టిగా చెప్పి ఆమె అతనితో సినిమా తీసి చూపించారు.
మొదట ఆ సినిమా కథను ఎంతో మంది నిర్మాతలకు చెప్పిన అప్పటి వరకు రొమాంటిక్ కామెడీ అనే ట్రెండ్ లేకపోవడం వల్ల ఆమె కథను రిజెక్ట్ చేసేవారట.అందరికీ చెప్పి చెప్పి అలసిపోయిన నందిని రెడ్డి ఇక పూర్తి నిరాశలో కూరుకుపోయిన సందర్భంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ ఒక కొత్త నిర్మాత ఉన్నారు అతనికి కథ చెప్పమని నందిని రెడ్డికి( Nandini reddy ) సూచించగా, ఎలాగు అతను కూడా ఒప్పుకోడు అని కాస్త నిరాశతోనే కథనైతే చెప్పింది కానీ ఒక్క సెట్టింగ్ లోనే ప్రొడ్యూసర్ కథను ఓకే చేశారట.ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు నిర్మాత దామోదర ప్రసాద్.
అయితే ఈ సినిమాకి హీరోగా ఎవరిని తీసుకుంటున్నావు అని అడగ్గా నాని గురించి చెబితే ఆయన కూడా నాని అప్పటికే అష్టాచమ్మా, రైడ్, స్నేహితుడా వంటి కొన్ని సినిమాలైతే చేశాడు కానీ రొమాంటిక్ కామెడీ అనే చిత్రానికి అతను సూట్ కాడని సందేహాన్ని వ్యక్తం చేశాడట.
అయితే నందిని రెడ్డికి ఉన్న కాన్ఫిడెన్స్, నాని ( Nani )మీద ఆమెకు ఉన్న నమ్మకం చూసి చిన్న మార్పు కూడా చెప్పకుండా ఆ సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నారట.మొదట స్వప్న దత్ సైతం ఆ కథ ఎంతో బాగుందని నిర్మించడానికి ముందుకు వచ్చిన ఆమె తండ్రి అశ్విని దత్ ఆ కథను నిర్మించడానికి వెనుకడుగు వేశారట.అయితే నిర్మాతగా దామోదర ప్రసాద్ ఒప్పుకున్నారు అనే విషయం తెలిసి స్వప్న దత్ ఎంతో సంతోషించి ఆల్ ది బెస్ట్ చెప్పారట.
సినిమా 2011లో విజయం సాధించిన తర్వాత అశ్విని దత్ కూడా తన జడ్జిమెంట్స్ తప్పు అయినందుకు సారీ చెప్పి, ప్రశంసలు వర్షం కురిపించారట.