టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) సతీమణి నమ్రత( Namrata ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నమ్రత మహేష్ బాబుని వివాహం చేసుకున్న అనంతరం ఈమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలని చూసుకుంటూ ఇంటికి పరిమితమయ్యారు.ఇక ప్రస్తుతం ఈమె పలు వ్యాపార రంగాలలోకి కూడా అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉన్నారు.
ఇక సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా తన పిల్లల గురించి ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను అభిమానులతో పంచుకొనే నమ్రత మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే తాజాగా మహేష్ బాబు నమ్రత దంపతులు శ్రియ భూపాల్( Shriya Bhupaal ) బేబీ షవర్ (Baby Shower)వేడుకలలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాలలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలలో మహేష్ బాబు ఫ్యామిలీ చాలా క్యూట్ గా ఉన్నారని చెప్పాలి.
ఇక ఈ ఫోటోలలో నమ్రత వేసుకున్నటువంటి డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.గ్రాఫిక్ డిజైన్ తో కూడిన ఈ కుర్తా గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి దీని ధర ఎంత ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు.ఈ ప్రత్యేకమైన జార్జియో ఆర్మానీ కుర్తా విలువ 4 లక్ష రూపాయలు అని తెలుస్తుంది.
ఇలా నమ్రత ధరించిన ఈ డ్రెస్ ( Namrata Dress ) ఖరీదు 4 లక్షల రూపాయల(4Lakhs)ని తెలియడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ముక్కున వేలు వేసుకుంటున్నారు.అయితే సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించడం సర్వసాధారణం.
అయితే ప్రస్తుతం నమ్రత డ్రెస్ ఖరీదు తెలిసి నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.