ఊటీకి చెక్కేస్తున్న నాగ్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.దీంతో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్’ కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

 Nagarjuna To Start New Movie In Ooty, Nagarjuna, Wild Dog, Praveen Sattaru, Ooty-TeluguStop.com

ఈ సినిమాను పూర్తిగా కాప్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా పూర్తి కాకముందే, నాగ్ తన నెక్ట్స్ చిత్రాను వరుసబెట్టి తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో నాగ్ తన నెక్ట్స్ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రవీణ్ సత్తారు ప్లా్న్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాను ఫిబ్రవరి చివరినాటికి ప్రారంభించి, అటుపై షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ను ఊటీలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్రణాళిక చేస్తుందట.

అక్కడ కొన్ని అందమైన సన్నివేశాలను తెరకెక్కించాక, తదుపరి షెడ్యూల్ కోసం యూకే వెళ్లేందుకు నాగ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమా ఎలాంటి నేపథ్యంతో తెరకెక్కుతుందా అనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ సినిమాలో నాగ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా, ఈ సినిమాలో నాగ్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.కాగా ప్రవీణ్ సత్తారుతో నాగ్ సినిమా చేస్తుండటంతో, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో ఎప్పట్నుండో క్యూలో ఉన్న బంగార్రాజు పరిస్థితి మరోసారి అయోమయంలో పడిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కాగా దర్శకుడు సోలోమాన్ తెరకెక్కిస్తున్న వైల్డ్ డాగ్ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube