ఆ ఒక్క కారణంతోనే హడావిడిగా చైతన్య నిశ్చితార్థం.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అక్కినేని వారసుడు నాగచైతన్య( Naga Chaitanya ) నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సంగతి మనకు తెలిసిందే.నటి సమంతను పెళ్లి చేసుకుని ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య మరొక నటి శోభిత( Sobitha ) ప్రేమలో పడ్డారు.

 Nagarjuna Comments About Nagachaitanya Sobitha Engagement Details, Nagarjuna, Na-TeluguStop.com

ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఆగస్టు 8వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే నిశ్చితార్థ అనంతరం నాగార్జున( Nagarjuna ) ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని నాగచైతన్య శోభిత ప్రేమ గురించి వారిని నిశ్చితార్థం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

Telugu Akkineninaga, Daggubati, Nagachaitanya, Nagarjuna, Sobitha-Movie

ఇక నాగచైతన్య శోభిత గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది.ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దవారి దగ్గర చెప్పడంతో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థపు వేడుక జరిగింది కానీ ఈ వేడుకకు ఎవరు సినీ సెలబ్రిటీలు హాజరు కాలేదు, చైతన్య అమ్మ తరపు బంధువులైన దగ్గుబాటి ఫ్యామిలీ( Daggubati Family ) కూడా ఈ నిశ్చితార్థం వేడుకలలో కనిపించలేదు.ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఇలా హడావిడిగా చేయడానికి గల కారణం ఏంటనే సందేహం అందరిలోనూ ఉంది.

Telugu Akkineninaga, Daggubati, Nagachaitanya, Nagarjuna, Sobitha-Movie

ఇక ఇదే విషయం గురించి నాగార్జున ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.నాగచైతన్య శోభిత నిశ్చితార్థానికి ఎవరిని పిలవక పోవడానికి కారణం ఉంది.వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని మాకు తెలియజేశారు.వారి ప్రేమ మీద 100% వారికి క్లారిటీ ఉందనే విషయం తెలియగానే వారి పెళ్లికి ఒప్పుకున్నామని తెలిపారు.ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు అంతేకాకుండా నాగచైతన్య శోభిత జాతకం ,నక్షత్రం ఆధారంగా ఆ రోజే బలమైన ముహూర్తం ఉన్న నేపథ్యంలో సింపుల్ గా నిశ్చితార్థం చేయాల్సి వచ్చిందని నాగార్జున ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక వీరి వివాహం కొద్ది నెలల విరామం తర్వాత జరుగుతుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube