అక్కినేని నాగచైతన్య( Naga chaitanya ) హీరోగా ఇప్పటివరకు ఎప్పుడు రాని ఎక్స్పెక్టేశన్స్ తో వస్తున్న సినిమా కస్టడీ( Custody )… ఇప్పటి వరకు ఎక్కువగా క్లాస్ హీరోగా విజయాలు అందుకున్న చైతూ.మాస్ హీరోగా చేసిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.
ఈ నేపథ్యంలో చైతూ ఇపుడు ఔట్ అండ్ ఔట్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కస్టడీ మూవీ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ అన్ని ఆకట్టుకునేలా ఉండటంతో .సినిమాపై అంచనాలు పెరిగాయి .మరి ఆ అంచనాలని ఈ సినిమా ఏ మేరకు అందుకుంది .మాస్ హీరోగా చైతు ఎంతవరకు అలరించారు .కస్టడీ అక్కినేని యువ హీరోకు విజయాన్ని అందించిందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం .
ముందుగా కధ విషయానికి వస్తే .నేరం చేసిన వ్యక్తికి చట్ట ప్రకారమే శిక్ష పడాలని కోరుకునే ఓ కానిస్టేబుల్ కధ ఇది .శివ అనే యువకుడి ఓ కానిస్టేబుల్ .శివ కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుంటాడు.అయితే అతని విషయంలో పై అధికారుల ఆలోచనలు మరోలా ఉంటాయి .అలాంటి సమయంలో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ .కస్టడీ నుంచి పారిపోయిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు .ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు .మధ్యలో అతని ప్రేమ కధలో ఎదురైన ఇబందులు ఏంటి .వృత్తిలో , ప్రేమలో శివ విజయ సాధించాడా అనేది అసలు కధ .
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే .ఓ ఆసక్తికర పాయింట్ తో సినిమాని మొదలు పెట్టిన విధానం బాగుంది .పెద్దగా సమయం వృధా చేయకుండా .దర్శకుడు నేరుగా కధలోకి తీసుకువెళ్లిన విధానం బాగుంది .కస్టడీ నుంచి నేరస్థుడు పారిపోవడం .అతని విషయంలో అధికారుల వ్యవహారం .శివ రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలు అలరిస్తాయి .ముఖ్యంగా నేరస్థుడ్ని పట్టుకునే క్రమంలో శివ ఎదుర్కొనే పరిస్థితులు థ్రిల్ కి గురి చేస్తాయి .ఓ పక్క యాక్షన్ సాగుతూనే .అంతర్లీనంగా ప్రేమకధని చూపించిన విధానం బాగుంది .
సినిమాలో ట్విస్ట్ లు ఆడియెన్స్ ని సినిమాలో లీనం అయ్యేలా చేస్తుంది .అలాగే దర్శకుడు వెంకట్ ప్రభు టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది .ద్వితీయార్ధం మొత్తం కూడా పలు కీలక అంశల తో సాగుతూ .ఆసక్తికరంగా ముగింపు నివ్వడం సిన్మాకే ప్లస్ అవుతుంది .ఇక నటీనటుల విషయానికి వస్తే .శివ అనే కానిస్టేబుల్ పాత్రలో చైతు ఒదిగిపోయాడు .యాక్షన్ సీన్స్ లో ,అలాగే లవ్ సీన్స్ లో మంచి నటన కనబరిచాడు .ఇక రేవతి పాత్రలో కృతి శెట్టి ఒదిగిపోయింది .ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి హుందాగా నటించారు.శరత్ కమార్, అరవింద్ స్వామి తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు .మిగతా నటీనటులు పాత్ర పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు .ఇక సాంకేతిక విషయాలకి వస్తే .ఇళయరాజా.యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.అలాగే వెంకట్ రాజన్ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది .ఎస్ ఆర్ ఖాతిర్ ఫొటోగ్రఫీ చక్కగా ఉంది .నిర్మాణ విలువలు కూడా సినిమ స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి మొత్తంగా చుస్తే మాస్ కథతో వచ్చిన కస్టడీలో మెప్పించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు .