నాగచైతన్య కస్టడీ మూవీ ప్రి రివ్యూ…

అక్కినేని నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా ఇప్పటివరకు ఎప్పుడు రాని ఎక్స్పెక్టేశన్స్ తో వస్తున్న సినిమా కస్టడీ( Custody ).

ఇప్పటి వరకు ఎక్కువగా క్లాస్ హీరోగా విజయాలు అందుకున్న చైతూ.మాస్ హీరోగా చేసిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు.

ఈ నేపథ్యంలో చైతూ ఇపుడు ఔట్ అండ్ ఔట్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన కస్టడీ మూవీ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు( Venkat Prabhu ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ అన్ని ఆకట్టుకునేలా ఉండటంతో .

సినిమాపై అంచనాలు పెరిగాయి .మరి ఆ అంచనాలని ఈ సినిమా ఏ మేరకు అందుకుంది .

మాస్ హీరోగా చైతు ఎంతవరకు అలరించారు .కస్టడీ అక్కినేని యువ హీరోకు విజయాన్ని అందించిందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం .

"""/" /</ ముందుగా కధ విషయానికి వస్తే .నేరం చేసిన వ్యక్తికి చట్ట ప్రకారమే శిక్ష పడాలని కోరుకునే ఓ కానిస్టేబుల్ కధ ఇది .

శివ అనే యువకుడి ఓ కానిస్టేబుల్ .శివ కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుంటాడు.

అయితే అతని విషయంలో పై అధికారుల ఆలోచనలు మరోలా ఉంటాయి .

అలాంటి సమయంలో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ .కస్టడీ నుంచి పారిపోయిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు .

ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు .మధ్యలో అతని ప్రేమ కధలో ఎదురైన ఇబందులు ఏంటి .

వృత్తిలో , ప్రేమలో శివ విజయ సాధించాడా అనేది అసలు కధ .

"""/" / ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే .ఓ ఆసక్తికర పాయింట్ తో సినిమాని మొదలు పెట్టిన విధానం బాగుంది .

పెద్దగా సమయం వృధా చేయకుండా .దర్శకుడు నేరుగా కధలోకి తీసుకువెళ్లిన విధానం బాగుంది .

కస్టడీ నుంచి నేరస్థుడు పారిపోవడం .అతని విషయంలో అధికారుల వ్యవహారం .

శివ రంగంలోకి దిగడం వంటి సన్నివేశాలు అలరిస్తాయి .ముఖ్యంగా నేరస్థుడ్ని పట్టుకునే క్రమంలో శివ ఎదుర్కొనే పరిస్థితులు థ్రిల్ కి గురి చేస్తాయి .

ఓ పక్క యాక్షన్ సాగుతూనే .అంతర్లీనంగా ప్రేమకధని చూపించిన విధానం బాగుంది .

"""/" / సినిమాలో ట్విస్ట్ లు ఆడియెన్స్ ని సినిమాలో లీనం అయ్యేలా చేస్తుంది .

అలాగే దర్శకుడు వెంకట్ ప్రభు టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది .ద్వితీయార్ధం మొత్తం కూడా పలు కీలక అంశల తో సాగుతూ .

ఆసక్తికరంగా ముగింపు నివ్వడం సిన్మాకే ప్లస్ అవుతుంది .ఇక నటీనటుల విషయానికి వస్తే .

శివ అనే కానిస్టేబుల్ పాత్రలో చైతు ఒదిగిపోయాడు .యాక్షన్ సీన్స్ లో ,అలాగే లవ్ సీన్స్ లో మంచి నటన కనబరిచాడు .

ఇక రేవతి పాత్రలో కృతి శెట్టి ఒదిగిపోయింది .ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి హుందాగా నటించారు.

శరత్ కమార్, అరవింద్ స్వామి తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు .

మిగతా నటీనటులు పాత్ర పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు .ఇక సాంకేతిక విషయాలకి వస్తే .

ఇళయరాజా.యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

అలాగే వెంకట్ రాజన్ ఎడిటింగ్ ఆకట్టుకుంటుంది .ఎస్ ఆర్ ఖాతిర్ ఫొటోగ్రఫీ చక్కగా ఉంది .

నిర్మాణ విలువలు కూడా సినిమ స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి మొత్తంగా చుస్తే మాస్ కథతో వచ్చిన కస్టడీలో మెప్పించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు .

నాగార్జున శివ సినిమా ఎంత మందికి లైఫ్ ను ఇచ్చిందో తెలుసా..?