సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సరసన చేసిన హీరోయిన్ అంకిత (Ankitha ) అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈమె రస్నా యాడ్ ద్వారా చాలా ఫేమస్ అయింది.
అలా ఈమె లాహిరి లాహిరి లాహిరిలో,సింహాద్రి,విజయేంద్ర వర్మ( Vijayendra varma ) ,సీతారాముడు ,ప్రేమలో పావని కళ్యాణ్,నవవసంతం,ఖతర్నాక్, మనసు మాట వినదు వంటి కొన్ని సినిమాల్లో నటించింది.అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ,కన్నడ భాషల్లో కూడా చేసింది.
అయితే అలాంటి ఈ హీరోయిన్ సడన్ గా ఇండస్ట్రీ నుండి కనిపించకుండా పోయింది.అంకిత బిజినెస్ మాన్ అయినా విశాల్ ని 2016 లో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో అంకిత హీరోయిన్ గా నటించింది.అలాంటి ఈ ముద్దుగుమ్మకి వరుసగా ఆఫర్లు వస్తాయని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ భావించారు.కానీ అందరూ అనుకున్న దానికి వ్యతిరేకంగా ఈమె సినీ కెరియర్ ఇండస్ట్రీలో తొందరగానే ముగిసిపోయింది.అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అంకిత ( Ankitha ) మాట్లాడుతూ నా కెరియర్ దాదాపు అయిపోతుంది అనే సమయంలో బాలకృష్ణతో విజయేంద్ర వర్మ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఇక ఆ సినిమాపైనే నా ఆశలన్నీ పెట్టుకున్నాను.ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితే నేను ఇండస్ట్రీలో ఉంటాను.లేకపోతే నా పని ఇక అయిపోయింది అనుకున్నాను.కానీ బాలకృష్ణ సినిమా కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను.చివరికి ఆ సినిమా ప్లాఫ్ అయింది.దాంతో నా సినీ కెరియర్ అక్కడితో ఆగిపోయింది.
ఎందుకంటే ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే కచ్చితంగా సక్సెస్ ఉండాలి.సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీ నుండి కనుమరుగవడం ఖాయం అంటూ చెప్పుకొచ్చింది.
ఇలా బాలకృష్ణ (Balakrishna) సినిమా వల్లే తన సినీ కెరియర్ ఎండ్ అయింది అని హీరోయిన్ అంకిత చెప్పకనే చెప్పింది.