హిందీ సీరియల్స్ లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఆ తర్వాత హిందీలో చిన్న చిన్న సినిమాల్లో నటించింది.ఇక ఎప్పుడైతే ఈమె సీతారామం ( Sitaramam ) సినిమాలో హీరోయిన్ గా చేసిందో అప్పటినుండి ఈమె ఫేట్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు.
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా చేస్తూ తగ్గేదేలే అన్నట్లు ఇండస్ట్రీలో కొనసాగుతోంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హాయ్ నాన్న అలాగే ఫ్యామిలీ స్టార్ అనే సినిమాల్లో నటిస్తుంది.
ఇక విజయ్ దేవరకొండ తో నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ ( Family Star ) అనే సినిమాకి సంబంధించి ఈ మధ్యనే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.దీనికి సంబంధించిన గ్లింప్స్ ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలాగే నానితో కలిసి చేసిన హాయ్ నాన్న అనే మూవీ డిసెంబర్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది.ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ ఆ టాలీవుడ్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతుంది.
మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ ఎవరి ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది.ఇది ఎంతవరకు నిజం అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలోనే సైమా అవార్డ్స్ ( Siima Awards ) జరిగిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సైమా అవార్డ్స్ లో మృణాల్ ఠాకూర్ కి సీతారామం సినిమాకి గానూ ఉత్తమ నటిగా అవార్డు వరించింది.ఇక ఈ అవార్డుని అల్లు అరవింద్ చేతుల మీదుగా మృణాల్ ఠాకూర్ అందుకుంది.ఇక ఇదే సమయంలో స్టేజ్ పైనే అల్లు అరవింద్ ( Allu Aravind ) నేను గతంలో ఒక వేదికపై ఓ హీరోయిన్ ని నువ్వు హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్ కి కోడలుగా వెళ్ళు అని చెప్పాను.
ఇక హీరోయిన్ అది నిజం చేసింది.ఇక నువ్వు కూడా హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకొని టాలీవుడ్ కి కోడలుగా రా అని అల్లు అరవింద్ అన్నాడు.
ఇక అల్లు అరవింద్ మాటలకి మృణాల్ ఠాకూర్ సిగ్గు పడిపోయింది.అయితే ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో లావణ్య త్రిపాఠి ( Lavanya tripathi ) గతంలో అల్లు అరవింద్ అన్న మాటలు నిజం చేసింది.
ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా ఈ మాటలను నిజం చేయబోతుంది కావచ్చు అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.