Sankranti Movies: కంటెంట్ యావరేజ్ అయిన కానీ సంక్రాంతి పండగ వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాని ఎవ్వరూ కాపాడలేరు.ఆ తర్వాత థియేటర్ కి వెళ్లడానికి కూడా జనాలు ఇష్టపడరు పబ్లిసిటీ ఎంత చేసినా మౌత్ టాక్ నెగిటివ్ రావడం అనేది సినిమాకి అతి పెద్ద మైనస్ గా మారుతుంది.

 Movies Turns Hit Because Of Sankranti Guntur Karam I Nayak Master Business Man-TeluguStop.com

అలాగే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం కాయం థియేటర్ కి రావడానికి ఇష్టపడని జనాలు కూడా సినిమా బాగుంది అంటే ఇంటి నుంచి బయటకు వస్తున్నారు.ఓటిటి కారణంగా ఇలాంటి ఒరవడి మరీ ఎక్కువైంది ఈ మధ్యకాలంలో.

అయితే హిట్ టాక్ తో, నెగెటివ్ టాక్ తో సంబంధం లేకుండా సంక్రాంతి( Sankranti ) వచ్చిందంటే చాలు సినిమాలో యావరేజ్ గానైనా నడిచి కలెక్షన్స్ సంపాదిస్తూ ఉంటాయి.మరి సంక్రాంతి పండగ వల్లే యావరేజ్ గా కంటెంట్ ఉన్నా కూడా హిట్ అయిన సినిమాలు ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గుంటూరు కారం

గుంటూరు కారం( Guntur Karam Movie ) సినిమా హనుమాన్ తో కంపేర్ చేయబడి బ్లాక్ బస్టర్ హిట్ అనే పదం నుంచి వెనక్కి వెళ్ళింది.అయినా కూడా సంక్రాంతి సెలవులు రావడంతో సినిమా ఎలా ఉన్నా సరే ఒక్కసారైనా మహేష్ బాబు సినిమాను చూడాలన్న కారణంతో దర్శకుడు పై ఉన్న అభిమానం కూడా తోడై ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి.

Telugu Average, Guntur Karam, Master, Nayak, Sankranti-Movie

శతమానం భవతి

శర్వానంద్( Sharwanand ) హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్ కాకపోయినట్టు అయ్యుంటే ఖచ్చితంగా పరాజయం పాలయ్యేది.ఎందుకంటే ఈ సినిమా మరి రొటీన్ కథతో వచ్చి కేవలం పండగ సీజన్ కాబట్టే విజయాన్ని పొందింది.

Telugu Average, Guntur Karam, Master, Nayak, Sankranti-Movie

విక్రమ్( Vikram ) హీరోగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది కానీ సంక్రాంతి పండగకి వచ్చిన సినిమా కావడంతో హిట్ టాక్ సొంతం చేసుకుని డిసెంట్ కలెక్షన్స్ నమోదు చేసుకుంది.

Telugu Average, Guntur Karam, Master, Nayak, Sankranti-Movie

సరిలేరు నీకెవ్వరు

గుంటూరు కారం తరహా లోనే సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు( Sarileru Neekevvaru ) కూడా అల్లు అర్జున్ అలా వైకుంఠపురం లో చిత్రం తో పోటీ పడాల్సి వచ్చింది.ఈ పందెం లో అలా వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోగా యావరేజ్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా మహేష్ బాబు సినిమా కాబట్టి సరిలేరు నీకెవ్వరు బాగానే వసూళ్లను సాధించింది.

Telugu Average, Guntur Karam, Master, Nayak, Sankranti-Movie

మాస్టర్

విజయ్( Vijay ) హీరోగా వచ్చిన ఈ చిత్రం కూడా కంటెంట్ పరంగా నెగటివ్ మార్కులు తగ్గించుకున్నప్పటికీ సంక్రాంతి పండుగ కావడంతో అలాగే స్టార్ హీరో చిత్రం కూడా కావడంతో రీసెంట్ కలెక్షన్స్ సాధించుకొని హిట్ చిత్రంగా నిలబడింది.

Telugu Average, Guntur Karam, Master, Nayak, Sankranti-Movie

నాయక్

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా కంటెంట్ పరవాలేదు అనే విధంగా ఉంది.అయితే సంక్రాంతికి వచ్చిన కారణంగా ఈ సినిమాను జనాలు ఆదరించారు.

Telugu Average, Guntur Karam, Master, Nayak, Sankranti-Movie

బిజినెస్ మాన్

ప్రతిసారి సంక్రాంతికి మహేష్ బాబు ఏదో ఒక సినిమాతో దండయాత్ర చేస్తూనే వస్తున్నాడు.అయితే బిజినెస్ మాన్ సినిమా( Business Man Movie ) కూడా కంటెంట్ పరంగా తక్కువ మార్కులు వేయించుకుంది కానీ కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube