ఉక్రెయిన్ నుండి ఆకలితో వచ్చిన కూతురు.. ఆమె తల్లి చేసిన పనికి అందరు ఫిదా!

ఉక్రెయిన్ దేశం పై రష్యా దేశం యుద్ధం ప్రకటించింది.ఇప్పటికే నాలుగు రోజుల నుండి భీకర యుద్ధం కొనసాగుతుంది.

 Mother Feeds To Daughter Who Came From Ukraine , Ukraine , Indian Embassy Ukrain-TeluguStop.com

ఈ రోజు ఐదవ రోజుకు చోరుకుంది.అయినా కూడా యుద్ధం వెనక్కి వెళ్లే ప్రసక్తి కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులను స్వదేశానికి తీసుకు రావడానికి అధికారులు చాలా కష్టాలనే ఎదుర్కొంటున్నారు.

తాజాగా ఉక్రెయిన్ నుండి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న విద్యార్థినికి ఒక తల్లి అందించిన ప్రేమను చూసి అందరికి చాలా హ్యాపీ గా అనిపిస్తుంది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తల్లి ప్రేమ అంటే ఇలానే ఉంటుంది అనిపిస్తుంది.ఈ వీడియో చాలా మందిని ఆకట్టు కుంటుంది.ఉక్రెయిన్ నుండి ఆకలితో వచ్చిన ఒక బిడ్డకు తల్లి ఎయిర్ పోస్టులోనే బిర్యానీ తినిపిస్తూ తన ప్రేమను చూపించింది.

Telugu Air, Biryani, Indianembassy, Indians Ukraine, Russia, Russia Ukraine, Tej

తూర్పు గోదావరి జిల్లా కు చెందిన రామలక్ష్మి తన కూతురు తేజస్విని విశాఖ పట్నం ఎయిర్ పోర్ట్ లోకి రాగానే అక్కడే ఆకలితో అలమటిస్తున్న ఆమె కూతురుకు తన చేత్తో బిర్యానీ తినిపించింది.ఈ వీడియో చూసిన అందరికి తల్లి ప్రేమ తలచుకుని ఇలాగె ఉంటుంది తల్లి ప్రేమ అంటే అని అనుకోకుండా ఉండలేక పోతున్నారు.యుద్ధ భూమి ఉక్రెయిన్ నుండి కొంతమంది మాత్రమే ఇప్పటి వరకు భారత్ చేరుకున్నారు.

ఇంకా చాలా మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తమని స్వదేశానికి తీసుకు రావాలని చాలా మంది విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు.ఎప్పుడు ఎటునుండి వారిని ప్రమాదం చుట్టూ ముందుటుందో అని బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు.గత నాలుగు రోజులుగా మన భారత దేశం విద్యార్థులు బ్యాంకర్లలోనే తలదాచుకుంటూ తిండిలేక అవస్థలు పడుతున్నారు.

ఇప్పటికే పలువురు వారి ఇబ్బందులను చెప్పుకుంటూ సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube