దేశంలో ప్రమాదకరమైన లేడీ డాన్లు వీళ్లే!

డాన్లు అంటే కేవలం మగవారు మాత్రమే ఉండరు.ఆడవాళ్లు కూడా ఉంటారు.

 Most Dangerous Lady Dons In India,dangerous Lady Dons, India, Reshma Memon And S-TeluguStop.com

డాన్ల లో దేశాన్నే వణికించిన ఆడవాళ్లు కూడా ఉన్నారు.దావుద్ ఇబ్రహీం లాంటి మగవారు మాత్రమే కాదు అలాంటి రాక్షస గుణం ఉన్న ప్రమాదకరమైన మహిళలు కూడా ఉన్నారు.వారు ఎవరు అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

రేష్మా మేమన్ – షబానా మేమన్ :

Telugu Archanapal, Lady, India, Lady India, Reshmamemon, Samaira Jamali, Samaira

రేష్మా మేమన్ – షబానా మేమన్ లను “ద ఉమెన్ బిహైండ్ ద బ్లాక్ ఫ్రైడే” అని కూడ అంటారు.1993 లో జరిగిన ముంబై బాంబ్ బ్లాస్ట్ లో ఈ ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించారు.వీళ్లు ముంబై అండర్ వరల్డ్ డాన్ అయిన టైగర్ మేమన్ భార్య మరియు చెల్లి.

ముంబై బాంబ్ బ్లాస్ట్ లో వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందగా ఇంటెలిజెన్స్ బృందాలు వీరిని పట్టుకోవడానికి పడిన కష్టం అంతా ఇంతా కాదు.ఇండియన్ ఏజెన్సీ వీళ్లు పాక్ లోని కరాచీలో ఉన్నారని భావిస్తోంది.

శోభా అయ్యర్ :

Telugu Archanapal, Lady, India, Lady India, Reshmamemon, Samaira Jamali, Samaira

మిస్టీరియస్ గ్యాంగ్ క్వీన్ అని పిలవబడే శోభా అయ్యర్ తమిళనాడులో ఎన్నో నేరాలకు పాల్పడింది.రాష్ట్రంలోని రాజకీయ నాయకులే ఆమెకు ఏ సమస్య వచ్చినా అండగా ఉన్నారంటే ఆమె ఎటువంటి డాన్ అనే విషయం సులభంగానే అర్థమవుతుంది.ఎన్నో విధ్వంసాలకు కారణమైన ఈమె అసలు రూపం కూడా పోలీసులకు తెలియదంటే ఈమె ఎంత భయంకరమైన డాన్ అనే విషయం అర్థమవుతుంది.

అర్చనా పాల్ ముకుంద్ శర్మ :

Telugu Archanapal, Lady, India, Lady India, Reshmamemon, Samaira Jamali, Samaira

అర్చనా పాల్ కిడ్నాప్ లకు పెట్టింది పేరు.ఈమెను ద క్వీన్ ఆఫ్ కిడ్నాపింగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు.సినిమాల్లో హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఎన్నో నీచమైన పనులు చేసి ఈమె వార్తల్లో నిలిచింది.విదేశాల్లో ఉండి కూడా కిడ్నాప్ లు చేయించిన ఈమె ఉజ్జయిని ప్రాంతానికి చెందిన మహిళ.

సమైరా జుమాలీ :

Telugu Archanapal, Lady, India, Lady India, Reshmamemon, Samaira Jamali, Samaira

ఈమె అండర్ వరల్డ్ డాన్ అబూసలెం భార్యల్లో ఒకరు.అబూసలెం పాల్పడిన ఉగ్రవాద కార్యక్రమాల్లో చాలా వాటిలో జుమాలీకి సంబంధం ఉంది.ఇంటర్ పోల్ ఈమెకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిందంటే ఈమె ఏ స్థాయి డాన్ అనే విషయం సులభంగానే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube