వామ్మో ఏందిది.. యువకుడికి చుక్కలు చూపించిన కోతి.. వీడియో వైరల్...!

రకరకాల జంతువులను చూసేందుకు చాలా మంది జూకి వెళ్తుంటారు.అయితే కొందరు సందర్శకులు హద్దుల్లో ఉండకుండా జంతువులకి దగ్గరికి వెళ్తుంటారు.

 Monkey Showing Dots To A Young Man Video Viral , Monkey, Social Media, Hassan A-TeluguStop.com

ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి జంతువులు మనుషుల పై దాడులు కూడా చేస్తుంటాయి.ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.

అయినా కూడా చాలామంది తీట పనులు చేస్తూ జంతువుల చేతుల్లో గాయాలపాలు అవుతున్నారు.తాజాగా కూడా ఒక వ్యక్తి ఇలాంటి చేదు అనుభూతిని ఎదుర్కొన్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ఈ షాకింగ్ ఘటన ఇండోనేషియాలోని కసాంగ్ కులీమ్ జూలో చోటు చేసుకుంది.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో హసన్ అరిఫిన్‌ అనే ఒక యువకుడు ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఒక తోక లేని పెద్ద కోతి (ఒరంగుటాన్‌) వద్దకు రావడం చూడొచ్చు.అయితే ఇతడు దాని వద్దకు వచ్చి రెచ్చగొట్టాడు.

మరింత దగ్గరికి వెళ్ళగానే ఆ కోతి ఆ వ్యక్తి చొక్కాను చాలా బలంగా లాగడం మొదలెట్టింది.ఆ తర్వాత కాళ్ళు పట్టుకొని అతడి గుండెల్లో గుబులు రేపింది.

ఇంకొక వ్యక్తి ఇతన్ని కాపాడడానికి ముందుకు వచ్చాడు.కానీ ఆ కోతి మాత్రం హసన్ ని అసలు వదిలి పెట్టలేదు.

ఆ యువకుడి కాలును గట్టిగా హత్తుకొని వదలనంటే వదలను అన్నట్టుగా మారాం చేసింది.

సాధారణంగా ఒరంగుటాన్‌ చాలా ప్రశాంతంగా ఉండే జీవి.

ఇది దాడి చేయడం చాలా అరుదు.కానీ వీడియోలోని వ్యక్తి మాత్రం “వచ్చి నన్ను పట్టుకో” అని కోతిని టీజ్ చేశాడు.

అందుకే ఈ కోతికి చిర్రెత్తుకొచ్చి అతడికి తగిన శాస్తి చేసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా… “మంచి పని జరిగింది.

ఇలాంటి వ్యక్తులకు ఇలాగే జరగాలి” అని కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube