హన్మకొండ జిల్లా జానకిపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తనపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ను కలిసి తనపై వచ్చిన ఆరోపణలన్నీ వివరిస్తానని రాజయ్య వెల్లడించారు.ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.
గత ఎన్నికల్లో చేసినట్లే మళ్లీ కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఎమ్మెల్యే రాజయ్య అసభ్యంగా మాట్లాడుతున్నారని, ఫోన్లు చేసి వేధిస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.