బీజేపీ రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఎమ్మెల్యే కేపి వివేకానంద్

బీజేపీ రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం.కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్బీజేపీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో షాపూర్ నగర్ వద్ద చేపట్టిన సమ్మెలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సంఘీభావం తెలిపారు.

 Mla Kp Vivekanand Comments On Bjp Govt , Bjp Aprty , Kp Vivekanand , Jeedimetl-TeluguStop.com

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అన్నారు.కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దేశంలో ఉన్న ప్రజా ఆస్తులు ఒక్కొకటిగా తరుగుతున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం అహంకారాన్ని వీడాలని, లేదంటే గతంలో రైతులు చేసిన ఉద్యమాలకు దిగి వచ్చి క్షమాపణ చెప్పినట్లే.

కార్మికులకు ప్రజలకు కూడా క్షమాపణ చెప్పే రోజులు వస్తాయన్నారు.కార్మిక లోకానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.కార్మిక సంఘాలు మాట్లాడుతూ.పోరాటం చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 నిర్దాక్షిణ్యంగా రద్దు చేయడం దారుణమని అన్నారు.

బిజేపి ప్రభుత్వ హయాంలో కార్మిక సంఘాలు బానిసలుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య, ఏఐటియూసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యూసుఫ్, టీఆర్ఎస్ కేవి రాష్ట్ర నాయకులు ముద్దాపురం మధన్ గౌడ్, ఐఎన్టియుసి జిల్లా నాయకుడు ఐలయ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్, మేడ్చల్ జిల్లా సీఐటీయూ నాయకుడు కీలుకాని లక్ష్మణ్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube