వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..!!

ఏపీలో జరగబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్( YCP YS Jagan ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఎన్నికల వాతావరణం పార్టీలో ఏడాది ముందు నుండే ఉండే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

 Mla Anil Kumar Yadav Has Announced That He Is Going To Contest As An Mp In The N-TeluguStop.com

“గడపగడపకు మన ప్రభుత్వం”( Gadapa Gadapaku Mana Prabhutvam ) నుండి మొన్నటి వరకు జరిగిన వైసీపీ సామాజిక బస్సు యాత్ర వరకు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలలో ఉండేలా వ్యవహరించారు.ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో నాయకుల పనితీరుపై సర్వేలు చేసుకుని ఆ ఫలితాల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో కొంతమందికి స్థానచలనం మరి కొంతమందిని పక్కన పెట్టేయడంతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉంటున్న వారిని కొంతమందిని ఎంపీలుగా కూడా పోటీకి దింపుతున్నారు.కాగా ఇప్పుడు ఆ రకంగానే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్( MLA Anil Kumar Yadav ) వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబోతున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలియజేశారు.వచ్చే ఎన్నికలలో నరసారావుపేట ఎంపీ( Narasaraopet MP )గా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.నిన్నటి దాకా అసెంబ్లీలో తిట్టా… రేపటి నుంచి చంద్రబాబుని ఢిల్లీలో తిడతా అని అన్నారు.వైసీపీ పార్టీలో వైయస్ జగన్ కి అత్యంత నమ్మకస్తులైన నాయకులలో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు.2019 ఎన్నికలలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.అయితే తర్వాత రెండోసారి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవి కోల్పోయారు.

ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube