అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ( Miss Shetty Mr Polishetty ).కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ కాగా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty ) స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతూ స్లోగా కలెక్షన్స్ రాబట్టి 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.అనుష్క, నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )జంట కొత్తగా ఉండడం కామెడీ కూడా ఆడియెన్స్ ను అలరించడంతో ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.నవీన్ ప్రమోషన్స్ కూడా బాగా చేసి ఆడియెన్స్ కు ఈ సినిమా చేరువ కావడంలో కీలక రోల్ పోషించాడు.ఇలా ప్రమోషన్స్ కూడా సినిమా కలెక్షన్స్ పెరగడంలో సహాయ పడ్డాయి.
ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించడంతో థియేటర్స్ లో ఈ సినిమా రెండు వారాల పాటు బాగా అలరించింది.ఇక ఈ వారం భారీ సినిమాలు రావడంతో క్లోజింగ్ కు వచ్చేసింది.
దీంతో ఓటిటిలో అతి త్వరలోనే రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది.
ఎప్పటి నుండో ఓటిటి రిలీజ్( OTT Release ) పై వార్తలు వస్తుండగా తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.అక్టోబర్ 5 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపారు.మరి ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
కాగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ పి ఈ సినిమాను తెరకెక్కించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.రధన్ సంగీతం అందించగా గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.