ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని మోదీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబ్ నగర్ కు బయలుదేరనున్నారు.మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్ హెలిపాడ్ వద్దకు చేరుకోనున్న మోదీ మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 గంటల వరకు మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.అనంతరం 3 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.సుమారు గంట పాటు బహిరంగ సభ వద్ద ఉండనున్న మోదీ సాయంత్రం 4.10 గంటలకు మహబూబ్ నగర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు.తరువాత అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.