వేడి వేడి కూరలో పడిపోయిన చిన్నారి.. పాటలు వింటున్న వంటమనిషి!

ఈ మధ్యకాలం స్కూల్స్ ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అంటే.వాటిని చెప్పకూడదు లెండి.

 Mid Day Meal Hot Curry Baby In Uttar Pradesh-TeluguStop.com

నిన్నటికి నిన్న ఓ బాలుడు వేడి వేడి సాంబార్ లో పడి మృతి చెందాడు.ఈరోజు వేడి వేడి కూర గిన్నెలో పడి ఓ చిన్నారి మృతి చెందింది.

మీకు అనుమానం రావచ్చు.ఆలా కూర గిన్నెలో చిన్నారి పడిపోతే వంట మనిషి ఏం చేస్తుంది అని.

ఇక్కడే ఉంది అసలు కథ.ఆ చిన్నారి ఆ వేడి వేడి కూరలో పడిపోతే వంటమనిషి ఎంచెక్కా పాటలు వింటుంది.కనీసం ఆ చిన్నారి ఆ కూరలో పడింది అనికూడా చూసుకోనంతగా ఆమె పాటలు వింటుంది.ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మిరజాపుర్ లోని ప్రభుత్వ పాటశాలలో చోటు చేసుకుంది.

పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న సమయంలో చిన్నారి ప్రాణాలు పోయాయి.వంటమనిషి పాటల పిచ్చి కారణంగా చిన్నారి కూరలో ఉడికిపోయింది.ఆస్పత్రికి హుటాహుటిన తరలించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.60 శాతానికి పైగా కాలిన గాయాలతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

దీంతో ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్ర ఆగ్రహాన్ని తెలిపారు.చిన్నారి మృతికి కారణమైన వంటమనిషిని సస్పెండ్ చేసినట్టు సమాచారం.కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయాల్సిందిగా మిరజాపుర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించింది.ఏమైనప్పటికి వంటమనిషి నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృత్యువాత పడాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube