చిరంజీవి 'గాడ్ ఫాదర్‌' అప్‌డేట్ వచ్చేసింది

మలయాళంలో సూపర్ హిట్‌ అయిన లూసీఫర్‌ ను తెలుగు లో చిరంజీవి రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.తెలుగు లో గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

 Megastar Chiranjeevi Godfather Movie Shooting Update,latest Tollywood News-TeluguStop.com

భారీ అంచనాలున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

ఇటీవలే చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా కాన్సెప్ట్‌ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా లో కీలక పాత్రలో సత్యదేవ్‌ నటించబోతున్నాడు.

భారీ అంచనాలున్న ఈ సినిమా లో నయనతార కూడా నటిస్తుందనే వార్తలు వకూడా వస్తున్నాయి.

Telugu Chiranjeevi, Godfather, Lucifer-Movie

ఇక ఈ సినిమా ను కేవలం 50 వర్కింగ్ డేస్ లోనే ముగించేలా ప్లాన్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ చకచక జరుగుతోంది.ఇప్పటికే 20 వర్కింగ్ డేస్ పూర్తి అయ్యిందని.

మొదటి షెడ్యూల్‌ పూర్తి అవ్వడంతో ఈనెల చివరి నుండి రెండవ షెడ్యూల్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ను ఎక్కువ శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

షూటింగ్ ను ఈ ఏడాది చివరి వరకు ముగించేలా ప్లాన్ చేశారట.ఈ సినిమా ముగింపు దశకు చేరుకున్న తర్వాత భోళా శంకర్ సినిమాను చేయబోతున్నారు.సినిమా చిత్రీకరణ పూర్తి అయినా కూడా విడుదల మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ఉంటుంది అంటున్నారు.ఈ సినిమా కోసం ప్రముఖ రచయితలు వర్క్‌ చేశారు.

ఒరిజినల్‌ వర్షన్ మెయిన్ కథను మార్చకుండా స్క్రీన్‌ ప్లేను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.చిరంజీవి లుక్ మరియు ఆయన పాత్ర ది బెస్ట్‌ అన్నట్లుగా ఉంటుందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube