హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే కీలక భేటీ నిర్వహించారు.ఇందులో భాగంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై చర్చిస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈనెల 6వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పాదయాత్రపై సీనియర్ నేతలతో మాణిక్ రావు థాక్రే చర్చలు జరుపుతున్నారు.
ఈ మేరకు సీనియర్ నాయకులందరూ పాదయాత్ర చేయాలని థాక్రే సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఎవరు ఎక్కడి నుంచి పాదయాత్రలు చేయాలో సమావేశంలో నిర్ణయించనున్నారని సమాచారం.