మంచు విష్ణు( Manchu Vishnu ) ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప( Kannappa ) సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లిన సంగతి మనకు తెలిసిందే.ఎప్పటినుంచో ఈయన కన్నప్ప సినిమాలో చేయాలని భావిస్తున్నారు.
సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నటువంటి విష్ణు ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించారు.ఆగస్టు నెలలోనే శ్రీకాళహస్తిలో ఎంతో ఘనంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు న్యూజిలాండ్( New Zealand ) లో ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే.శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి తరుణంలో హీరో మంచు విష్ణుకు గాయాలు తగిలాయి.పొరపాటున డ్రోన్ కెమెరా మంచు విష్ణు చేయికి తగలడంతో ఆయన చేతికి గాయం అయింది.
దీంతో విష్ణు కొద్ది రోజులపాటు షూటింగుకు దూరంగా ఉన్నారు.తాజాగా విష్ణు హెల్త్ ఎలా ఉంది ఏంటి అనే విషయాల గురించి మంచు మోహన్ బాబు ( Mohan Babu ) స్పందించి తన హెల్త్ అప్డేట్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు విష్ణు ఆరోగ్యం గురించి స్పందిస్తూ.మంచు విష్ణుపై మీ అందరి ప్రేమ, ఆయన హెల్త్ పై ఆందోళనకు కృతజ్ఞతలు.న్యూజిలాండ్‌లో కన్నప్ప సెట్‌లో విష్ణుకు ప్రమాదం జరిగింది.భగవంతుని దయతో కోలుకుకుంటున్నాడు.త్వరలో మళ్లీ షూటింగ్‌కి తిరిగి వస్తాడు.మీ సపోర్ట్ కు ధన్యవాదాలు.
హర హర మహాదేవ్.అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా విష్ణు హెల్త్ అప్డేట్ గురించి తెలియజేశారు అయితే ఈయన కోరుకుంటున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక కన్నప్ప సినిమా భారీ తారాగణంతో వివిధ భాష సెలబ్రిటీల అందరిని కూడా భాగం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.