27 ఏళ్లు వచ్చినా నన్నెవ్వరు ప్రేమించలేదు, నేను వర్జిన్‌, అందుకే హత్యలు

పాతిక, ముప్పై ఏళ్లు వచ్చినా నాకు ఇంకా ఉద్యోగం దొరకలేదు, మంచి చదువులు చదివినా కూడా ఈ ప్రభుత్వాలు నాకు ఉద్యోగం ఇవ్వలేక పోతున్నాయంటూ కొందరు ప్రభుత్వాలపై ఆగ్రహంతో ఉంటారు.వారిది చేతకాని తనం.

 Man Accused Of Threatening To Kill As Many Girls As I See-TeluguStop.com

ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రైవేట్‌ సెక్టర్‌ల్లో కూడా ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి.వాటిని ప్రయత్నించుకోవచ్చు.

కాని వాటికి ప్రయత్నించకుండా ప్రభుత్వ ఉద్యోగమే కావాలని కొందరు పట్టుబట్టి కూర్చుని ఉద్యోగం రాలేదంటే ఏడుస్తూ ఉంటారు.ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటారు.

కాని ఉటాహ్‌ దేశానికి చెందిన క్రిస్టిఫర్‌ డబ్ల్యూ క్లియరీ అనే వ్యక్తి వింతగా వాదిస్తూ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాడు.

తాజాగా క్రిస్టిఫర్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టాడు.

తన వయసు 27 ఏళ్లు అని, కాని నేను ఇప్పటి వరకు ఎవరి ప్రేమలో పడలేదు, ఎందుకంటే ఎవరు నన్ను ప్రేమించలేదు.మంచి అందం, బాగానే సంపాదిస్తూ ఉన్నా కూడా నన్ను ఏ ఒక్క అమ్మాయి కూడా పట్టించుకోవడం లేదు, నాతో డేటింగ్‌కు ఆసక్తి చూపడం లేదు అంటూ వాపోయాడు.

ఈమద్య కాలంలో 15 ఏళ్లకే కుర్రాళ్లు అమ్మాయిలను వెంటేసుకు తిరుగుతూ, ఎంజాయ్‌ చేస్తూ ఉంటే నేను మాత్రం 27 ఏళ్లు వచ్చినా కూడా వర్జిన్‌ గానే ఉన్నాను.అందుకే నన్ను వద్దనుకుంటున్న అమ్మాయిలందరిని వరుస పెట్టి చంపేస్తానంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు.

క్రిస్టఫర్‌ పోస్ట్‌ చేసిన విషయం దావానంలా వ్యాప్తి చెందింది.అతడిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.అన్నట్లుగానే క్రిస్టఫర్‌ అమ్మాయిలను చంపేందుకు సిద్దమై అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోవడం కాస్త ఆలస్యమైతే పరిస్థితి చేయి దాటి పోయేది.

పోలీసుల అదుపులో ఉన్న క్రిస్టఫర్‌ మాట్లాడుతూ తాను మానసిక వ్యాదితో బాధపడుతున్నాను.ఏదైనా కోరుకున్నప్పుడు దక్కక పోతే దాన్ని నాశనం చేయాలనే ఆలోచన కలుగుతుంది.

ఇంపల్స్‌ కంట్రోల్‌ డిజాస్టర్‌ సమస్య నన్ను తీవ్రంగా వేదించడంతో రెండు మూడు సార్లు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డట్లుగా ఇతడు చెప్పుకొచ్చాడు.ఈ ఆలోచనతో ఉగ్రవాదుల్లో కూడా కలిసే అవకాశం ఉందని, పోలీసులు అతడికి మానసిక చికిత్స చేయించాలని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube