Allu Arvind : రీ రిలీజ్ లో కూడా కొత్త ట్రెండ్ ని మొదలు పెట్టబోతున్న అల్లు అరవింద్.. అదేంటంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది.మొదట మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్‌ల పరంపర కొనాసాగుతూనే ఉంది.

 Magadheera Athadu Gharanamogudu Re Released In Aha Ott-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే కొత్త సినిమాల రిలీజ్‌ల సందడి కంటే రీ రిలీజ్‌ల సందడే ఎక్కువగా కనిపిస్తోంది.హీరోల పుట్టిన రోజు సందర్భంగా ఆయా హీరోల కెరియర్ లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలతో పాటు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మరోసారి థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

అలా హాలీవుడ్ లో ఇప్పటికే చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,ప్రభాస్, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు నటించిన సినిమాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Telugu Athadu, Balakrishna, Chiranjeevi, Gharanamogudu, Magadheera, Nagarjuna, P

అయితే హీరోల పుట్టినరోజు వేడుకలకు సినిమాలను రీ రిలీజ్ చేయడం అన్నది పాత ట్రెండ్ అయిపోయింది అనుకున్నారు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్.అందుకే ఈ రీ రిలీజ్స్‌లో కొత్త ట్రెండ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.అందుకోసం తమ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా లో ఈ రీ రిలీజ్ ల ట్రెండ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు.

ఈ ట్రెండ్ ని తమ నిర్మాణంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మగధీర సినిమా( Magadheera )తో మొదలు పెట్టబోతున్నట్లు వెల్లడించారు.రామ్ చరణ్, రాజమౌళి కలయికలో వచ్చిన ఈ సినిమా తెలుగు పరిశ్రమ రూపురేఖల్ని మార్చేసింది.

ఈ సినిమా రీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Telugu Athadu, Balakrishna, Chiranjeevi, Gharanamogudu, Magadheera, Nagarjuna, P

నవంబర్ 3న ప్రీమియం క్వాలిటీతో మగధీరని ఆహాలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.ఈ మూవీ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ఆల్ టైం ఫేవరెట్ సినిమా అతడు మూవీని కూడా రీ రిలీజ్ చేయనున్నారు.నవంబర్ 10 నుంచి ఈ మూవీ ప్రీమియం క్వాలిటీతో ప్రసారం కానుంది.

ఇక నవంబర్ 17న అల్లు అరవింద్( Allu Arvind ) నిర్మాణం నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ చిరంజీవి ఘరానా మొగుడు సినిమాని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు.మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఆహాలో రీ రిలీజ్ చేస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube