దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
మనీలాండరింగ్ కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.ఈ మేరకు నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది.కాగా, జనవరి 6న 13 వేల 657 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో ఐదుగురు నిందితులతో పాటు ఏడు కంపెనీలను చేర్చింది.అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుతో అమిత్ అరోరాలను ఈడీ చేర్చింది.