'లియో' మేకర్స్ భారీ ప్లాన్.. పెయిడ్ ప్రీమియర్స్ కు సిద్ధం!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) కు కోలీవుడ్ లో మాత్రమే కాదు మన తెలుగులో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.అందుకే తన సినిమాల కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తుంటారు.

 Leo Movie Makers Planning Paid Premiers In Tamilnadu, Thalapathy 67, Thalapat-TeluguStop.com

మరి అలాంటి హీరో వారిసు వంటి విజయం తర్వాత మరో సినిమా చేసాడు.దళపతి విజయ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వంలో ‘లియో’ సినిమా ( LEO Movie )చేస్తున్నాడు.

Telugu Leo, Leomakers, Tamilnadu, Thalapathy, Trisha-Movie

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.ఫస్ట్ సింగిల్ తర్వాత మళ్ళీ సంజయ్ దత్ పాత్ర గురించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.ఈ ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మరిన్ని అంచనాలు కూడా పెంచేసాయి.

ప్రస్తుతం లాస్ట్ పార్ట్ షూట్ కంప్లీట్ చేస్తూనే రిలీజ్ కు భారీ ప్రణాళికలు వేసుకుంటున్నారు.ఇప్పటికే యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మేకర్స్ తమిళనాడులో విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్స్ ఏర్పాటు చేయాలనీ ఆలోచనలో ఉన్నారట.

Telugu Leo, Leomakers, Tamilnadu, Thalapathy, Trisha-Movie

అక్కడ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో పెయిడ్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 18న వేయాలని నిర్ణయం తీసుకున్నాట్ట తెలుస్తుంది.ఇదే నిజమైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేసే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష( Trisha ) హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube