మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)లావణ్య త్రిపాఠిల (Lavanya Tripati) వివాహం త్వరలోనే జరగబోతోందనే విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే వీరిద్దరిని నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇలా వీరిద్దరి వివాహంజరగబోతోందని తెలియగానే వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక లావణ్య వరుణ్ నిశ్చితార్థం(Engagment) అనంతరం వీరి ప్రేమ గురించి ముందే ఊహించిన అల్లు అరవింద్ వీరిద్దరి గురించి ఎప్పుడో హింట్ ఇచ్చారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
అల్లుఅరవింద్ నిర్మాణంలో లావణ్య నటించిన ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె తెలుగు స్పష్టంగా మాట్లాడటంతో అల్లు అరవింద్ (Allu Aravind) మధ్యలో మాట్లాడుతూ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావ్.ఇక్కడే ఒక తెలుగు అబ్బాయ్ ను చూసి ఇక్కడే సెటిల్ అయ్యిపో అంటూ చెప్పిన వీడియో వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో అల్లు అర్జున్(Allu Arjun) కూడా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా నాన్నకు చాలా ముందు చూపు ఉంది అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈమె మెగా కోడలు కాబోతుందనే విషయం ముందుగానే ఒక సినిమా ద్వారా తెలియజేసిందంటూ వీడియో వైరల్ గా మారింది.లావణ్య త్రిపాఠి నటించిన మొదటి చిత్రం అందాల రాక్షసి(Andala Rakshasi).
ఈసినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా ఈమె తన పెళ్లికి చిరంజీవి వస్తాడు అంటూ కామెంట్ చేశారు.
ఇందులో లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతుండగా కొందరు పిల్లలు వచ్చి నీ పెళ్ళికి చిరంజీవి వస్తాడంట కదా అని అడిగారు.ఇలా పిల్లలు అడగడంతో లావణ్య త్రిపాఠి కూడా తన పెళ్లికి చిరంజీవి వస్తాడని చెప్పింది.ఆ రోజు సినిమాలో చెప్పిన విధంగా ఈ రోజు లావణ్య పెళ్లికి చిరంజీవి రావడమే కాకుండా మెగా ఇంటికి కోడలిగా కూడా రాబోతున్నారు.
ఇక వీరి పెళ్లికి చిరంజీవి(Chiranjeevi) పెద్దగా మారిపోయారు.ఈ క్రమంలోనే లావణ్య నటించిన ఈ సినిమాలోని ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.