Prabhas : వామ్మో..320 కోట్లు పెట్టి కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబెల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ( Prabhas ) బాహుబలి( Baahubali ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు.

 Latest News About Pan India Star Prabhas-TeluguStop.com

అప్పటినుంచి ప్రభాస్ తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .అయితే ఈ సినిమాలు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోలేకపోయినా కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ అయ్యాయి.ఇక త్వరలోనే ప్రభాస్ సలార్ సినిమా ( Salaar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇక పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ప్రభాస్ ఒక్క సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారనే విషయం మనకు తెలిసిందే.

ఇలా వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్ భారీ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది.అయితే ఈయన ఇదివరకే హైదరాబాద్లో సిటీకి బయట ప్రశాంతంగా ఉండడం కోసం ఏకంగా రెండు ఎకరాల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేశారని ఈ స్థలం విలువ సుమారు 120 కోట్ల వరకు ఉంటుందని ఇదివరకే వార్తలు వచ్చాయి.ఈ స్థలంలో ప్రభాస్ కొత్త ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.120 కోట్ల రూపాయల ఖర్చు చేసి స్థలం కొన్నటువంటి ప్రభాస్ ఏకంగా 200 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ ప్రాంతంలో ఇల్లు నిర్మించడానికి సిద్ధమయ్యారట.

ఇప్పటికే హైదరాబాద్లో ఎన్నో విలాసవంతమైనటువంటి భవనాలు ఉన్నాయి అయితే అవన్నీ సిటీ మధ్యలో ఉండటం వల్ల ప్రభాస్ కి అక్కడ ఉండటం నచ్చలేదని అందుకే ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికే సిటీ అవుట్ సైడ్ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసి ఏకంగా 200 కోట్లతో ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇలా ప్రభాస్ ఈ ఇంటి కోసం ఏకంగా 320 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్ కి ఇది కేవలం మూడు సినిమాల్లో రెమ్యూనరేషన్ మాత్రమే నని మరికొందరు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.ఇంటి కోసం 320 కోట్లు ఖర్చు చేయడం అంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే సలార్ సినిమా విడుదల కాగ ఈ సినిమాతో పాటు కల్కి, స్పిరిట్, మారుతి డైరెక్షన్ లోని సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=251374770900203
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube