రాధిక కుమారస్వామి మొదటి భర్త ఎంత కిరాతకుడో తెలుసా? బయటపడ్డ అసలు నిజం.!

ఎన్నో ట్విస్టులు…సీఎం ఎవరు అవుతారో అర్థం కాలేదు.రెండు రోజులు హై టెన్షన్.

 Kumaraswamy Wife Radhika First Husband-TeluguStop.com

చివరికి క‌ర్నాట‌క సిఎంగా కుమార‌స్వామి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.ఈక్ర‌మంలో ఆయ‌న గురించి మ‌రింత‌గా తెలుసుకోవాల‌నుకునే వారు ఆయ‌న పేరును గుగూల్ లో సెర్చ్ చేస్తారు.

కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆయ‌న గురించి కాకుండా ఆయ‌న భార్య గురించి గుగూల్ లో వెతుకులాట ఎక్కువైంది.దీనంత‌టికి కార‌ణం కుమార‌స్వామి భార్య హీరోయిన్ కావ‌డ‌మే.! దానికి తోడు కుమార‌స్వామిది ల‌వ్ మ్యారేజ్ కావ‌డం.ఇది ఇద్ద‌రికీ రెండో వివాహం కావ‌డం కూడా నెటీజ‌న్లు అలా సెర్చ్ చేయ‌డానికి కార‌ణ‌మైంది.

ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగు సంగతులు మీకు తెలుసా? తెలుగులో ఆమె నటించినవి రెండు చిత్రాలు… 1) 2004లో తారకరత్న నటించిన భద్రాద్రిరాముడులో సీత పాత్ర… 2) తరువాత పదేళ్ల తరువాత, అంటే 2014లో సత్యప్రకాష్ సినిమా అవతారంలో మరో చిన్నపాత్ర.16 ఇయ‌ర్స్ కే సినిమాల్లోకి ప్ర‌వేశించిన రాధిక క‌న్న‌డ, త‌మిల్ సినిమాల్లో మంచి పాత్ర‌లు పోషించారు.ఈ స‌మ‌యంలో కుమార‌స్వామి క‌న్న‌డ సినిమాల‌కు ప్రొడ్యూస‌ర్ గా ఉన్నారు.ఈ క్ర‌మంలోనే రాధిక‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి అది కాస్త ప్రేమ‌గా మారింది.అప్ప‌టికే కుమార‌స్వామికి పెళ్ళై నిఖిల్ గౌడ అనే కుమారుడు కూడా ఉన్నాడు.2006 లో రాధిక‌ను ర‌హ‌స్యంగా పెళ్ళి చేసుకున్న విష‌యం 2010 లో అంద‌రికీ తెలిసింది.

పొలిటికల్, సినిమా, బ్యూరోక్రటిక్, జర్నలిస్ట్ సర్కిళ్లలో అందరికీ తెలిసిన విషయమే అయినా అనధికారిక పెళ్లే… 2011లో ఒకాయన పిటిషన్ వేశాడు… మొదటి భార్య బతికి ఉండగానే, మరో పెళ్లి చేసుకుని ‘బహుభార్యత్వం’ నేరానికి పాల్పడ్డాడు కాబట్టి, లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని ఆ పిటిషన్ సారాంశం… దీనికి చట్టంలో శిక్షలు కూడా ఉన్నాయ్… అయితే 2012లో హైకోర్టు దీన్ని సాక్ష్యాధారాలు లేవని కొట్టేసింది… అన్నట్టు ఈ రాధిక జీవితంలో ఆమె మొదటి పెళ్లికి సంబంధించి ఓ విషాదం, ఓ వివాదం కూడా ఉన్నాయి… తను ఏడో తరగతిలో ఉండగానే రతన్ కుమార్‌ అనే వ్యక్తితో పెళ్లి చేశారట తల్లిదండ్రులు… రాధిక తండ్రి దేవరాజ్ కావాలనే ఆమె కెరీర్‌కు అడ్డం వస్తుందనే భయంతో, ఈ పెళ్లి విషయాన్ని దాచిపెట్టాడని రతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు…

కాదు, కాదు, రాధికను రతన్‌ కుమార్ నిర్బంధంగా పెళ్లి చేసుకున్నాడని తరువాత రాధిక తల్లి ఆరోపించింది… అంతేకాదు, రతన్ క్రూరంగా రాధికను సజీవదహనం చేయటానికి కూడా ప్రయత్నం చేశాడని కూడా రాధిక తండ్రి ఆరోపించాడు… ఈ వివాదం, గొడవ ఇలా ఉండగానే 2002లోనే సదరు రతన్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో అన్ని వివాదాలకు తెరపడింది… ఆమె కెరీర్ గాడిలో పడింది… తరువాత కుమారస్వామితో పెళ్లి… అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉండేది… 2015 తరువాత కాస్త గ్యాప్… 2018లో రవిచంద్ర పొన్నప్ప సహా మరో రెండు సినిమాల ద్వారా రీఎంట్రీ ఆలోచన చేసింది… నిజానికి కుమారస్వామి మొదటి భార్య అనిత కొడుకు నిఖిల్ గౌడ్… తనూ హీరోయే… ఇప్పుడు పొలిటిషియన్…

రాధిక కుమారస్వామి పేరుకు ఆయన భార్య… అనధికారికం… అసలు భార్య అనిత మాత్రమే… రాజకీయ వారసులు కూడా అనిత, అనిత కొడుకు నిఖిల్… మొన్న కుమారస్వామి చెన్నపట్న, రామనగర రెండు చోట్ల పోటీచేసి గెలిచాడు… కానీ చెన్నపట్న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశాడు కాబట్టి ఇక రామనగర ఖాళీ అయినట్టే… అక్కడ భార్య అనితతో పోటీ చేయించాలనేది కుమారస్వామి ఆలోచన… ఆమెకు ఎన్నికల్లో పోటీ కొత్తేమీ కాదు, గతంలో చెన్నపట్నలో పోటీచేసి ఓడిపోయింది… ఇప్పుడా సీటును అలాగే ఉంచుకుని, సేఫ్ సీటుగా ఉండే రామనగర నుంచి భార్యను పోటీ చేయించాలని ప్లాన్… మరి రాధిక.? ఏముంది.? ఆమెకు తన కూతురు షమిక పేరిట ఓ ప్రొడక్షన్ హౌజ్ ఉంది కదా… ఏవో తన సినిమా వ్యవహారాలు తను చూసుకుంటుంది… అంతే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube