YSRTP అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర సంచలనం సృష్టిస్తుంది.ఇటీవల ఈ పాదయాత్రలో ఆమె కాన్వయ్ పై దాడి జరగటంతో .
అదే సమయంలో ఆమెకు గాయం కూడా అవటం జరిగింది.దీంతో తనపై టిఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల తన పార్టీ కార్యకర్తలతో ప్రయత్నించిన క్రమంలో పోలీసులు ఆమెను కారులో ఉన్న సమయంలోనే క్రేన్ సాయంతో… పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ పరిణామంపై తీవ్రస్థాయిలో పలు రాజకీయ పార్టీల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి.
ఇటీవల ప్రధాని మోడీ ఈ ఘటనపై షర్మిల కి ఫోన్ కూడా చేసినట్టు వార్తలు రావడం జరిగాయి.
కాగా ఇప్పుడు తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమిటీరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఒక మహిళ అని చూడకుండా దారుణంగా వ్యవహరించారని విమర్శించారు.
ఏది ఏమైనా షర్మిల ఘటనను అందరూ ఖండించాలని సూచించారు.ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరో ఏడాదిన్నర పాటు తన నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి పెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.తాను ఏ పార్టీలో జాయిన్ అవ్వటం జరుగుతుందో… సరిగ్గా ఎన్నికలకు నెల ముందు చెబుతానని క్లారిటీ ఇచ్చారు.
వేరే పార్టీ ప్రజా ప్రతినిధులను తన పార్టీలో జాయిన్ చేసుకొని బలం అనుకుంటుందని టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు.