కూతురిని చంపి ఆపై దంపతుల ఆత్మహత్య.. అసలు కారణం ఏమిటంటే..?

ఇటీవలే కాలంలో మనిషి ఏదైనా సమస్య వస్తే మార్గాలు వెతకకుండా ఏకంగా హత్య చేయడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.ఇలాంటి కోవలోనే ఓ దంపతులు తమ కన్న కూతురిని చంపేసి ఆపై వారు కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటక( Karnatakaలో చోటుచేసుకుంది.

 Killing The Daughter And Then The Suicide Of The Couple.. What Is The Real Reaso-TeluguStop.com

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.కర్ణాటకలోని కోడగు జిల్లాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ కు ఓ దంపతులు తమ కుమార్తెతో పాటు వెళ్లారు.ఏం జరిగిందో తెలియదు కానీ రిసార్ట్ రూమ్ లో ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు విగత జీవులుగా పడి ఉండడం చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దంపతులు ముందుగా తమ కుమార్తెను చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.

ఈ దంపతులను కేరళ( Kerala )లోని కొట్టాయం కు చెందిన వినోద్ (43), జుబీ అబ్రహం(37), వీరి కుమార్తె జోహన్ (11) గా పోలీసులు గుర్తించారు.

పోలీసుల విచారణలో ఈ కుటుంబ సభ్యులు శనివారం రిసార్ట్ లోకి వెళ్లి అదే రోజు ఈ దారుణానికి పాల్పడ్డారు.సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.

ఆ సూసైడ్ నోట్ లో కేరళలోని కొట్టాయం కు చెందిన తమకు ఆర్థిక ఇబ్బందులు( Financial difficulties ) ఉన్నాయని, అందుకే వాటి కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని రాసి ఉంది.పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూస్తే దంపతులిద్దరూ ఫ్యాన్ కి ఉరి వేసుకుని వేలాడుతున్నారు.

కుమార్తె మంచంపై విగత జీవిగా పడింది.కేరళలో ఈ దంపతులపై ఆర్థిక నేరాల కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube