యాంకర్ వాయిస్ – సీఎం జగన్ పని అయిపోయింది , అధికారంలోకి కూర్చునేందుకు మా లీడర్లు సిద్ధం కావాలి.60 శాతం యువతకు టికెట్లు ఇస్తే 175 సీట్లలో టిడిపి విజయం ఖాయమన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి.వాయిస్ ఓవర్: తెలుగుదేశం పార్టీ కి కార్యకర్తలే ప్రధాన బలం అని మూడునరేళ్ళ పాటు కార్యకర్తలు కష్టపడితే ఈ నాయకులందరూ ఎక్కడికి పోయారంటూ సొంత పార్టీ నేతలకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి చురకలాంటించారు.యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కలసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పని అయిపోయిందని అధికారంలో కూర్చోవడానికి మా నాయకులు సిద్ధం కావాలన్నారు.40 శాతం కాదు 60 శాతం యువతకు టికెట్లు ఇస్తే 175 స్థానాల్లోనూ టిడిపి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ధైర్యంగా ముందుకు వచ్చి కార్యకర్తలను కలుపుకొని వెళ్లే లీడర్లకి టికెట్లు ఇవ్వాలని ఇదే విషయాన్ని నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పారు.
నా మీద 72 కేసులు పెట్టిన భయపడలేదని అలా అని టికెట్ కోసం నేనేమీ తాపత్రయ పడలేదన్నారు పార్టీ కోసమే కష్టపడి పని చేస్తున్నారని స్పష్టం చేశారు.ఇటీవల యువకులం పాదయాత్రలో ఓ నాయకుడు దారి కూడా నడవలేకపోయాడని అలాంటి వారికి టికెట్టు ఎందుకంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ ఏ ఘడియలో పార్టీ స్థాపించారు గాని టిడిపికి బలమైన కార్యకర్తలు ఉన్నారని కొందరు నాయకులు తోకలు కట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.చంద్రబాబు ఫేస్ వ్యాల్యూ ను చూసే ఓట్లు పడతాయని మాలాంటి వాళ్లను చూసి కాదని తెలియజేశారు.
భైట్ – జే.సి.ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిఫల్ చేర్మెన్ .