తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేని ఆస్పత్రులపై చర్యలకు సిద్ధమైంది.
దీనిలో భాగంగా కనీస మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం లేని ఆస్పత్రుల పై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు.
కాగా, పది రోజుల్లో ఈ తనిఖీలు పూర్తి చేసి, డీఎంహెచ్ఓలు నివేదికలు అందించాలని సర్కార్ ఆదేశాల్లో పేర్కొంది.