కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్దం ప్రకటించిన విషయం విధితమే.ఈ విషయంలో కేసీఆర్ దూకుడుగానే వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు.
అనుకున్నదే తడువుగా దేశ వ్యాప్తంగా బీజేపీయేతర శక్తులను ఏకం చేసే పనిలో బిజీగా ఉంటున్నారు.ఇందుకు వ్యూహాలు కూడా రచిస్తూ అధిక సమయం వెచ్చిస్తున్నారు.
కేవలం బీజేపీపై దృష్టిసారించడం.రాష్ట్రంలో మంత్రి వర్గ ప్రక్షాళన విషయం విస్మరించడంతో చర్చలకు దారితీస్తోంది.
అయితే మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ గతం నుంచే చెప్పుకొస్తున్నా .ఆచరణలో తీవ్ర జాప్యం చేస్తున్నారు.ఇక మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు అధినేత కటాక్షం కోసం ఎదురు చూపులు తప్పట్లేదు.వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గ విస్తరణ వెంటనే చేపట్టాలనే టాక్ వస్తోంది.
అయితే ఈటల రాజేందర్ వెళ్లి పోవడంతో ప్రస్తుతం కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక స్థానం ఖాళీ అయింది.దానిని భర్తీ చేయకుండా సంబంధిత బాధ్యతలను ఆర్థిక మంత్రి హరీష్‌రావుకు అప్పజెప్పడం గమనార్హం.
ఈ అసెంబ్లీ ఎన్నికలను పక్కన బెడితే మరోవైపు జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ వల్లె వేస్తుండడం గమనార్హం.ఇక మంత్రి వర్గ ప్రక్షాళన అనేది ఎప్పడో తెలియని పరిస్థితి నెలకొంది.
అధికారం వచ్చిన తొలినాళ్లలో ఇద్దరు కేసీఆర్, హోంమంత్రి మహముద్ అలీతో మంత్రి వర్గం ఏ ర్పాటు చేశారు.రెండు నెలల అనంతరం పది మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
ఆదే నెలల తరువాత మరో ఆరు పదవులు భర్తీ చేసిన విషయం విధితమే.
ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాష్, వెకంట్రామిరెడ్డి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం.పదవీకాలం ఉన్నపటికీ రాజ్య సభ నుంచి బండా ప్రకాష్‌ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు.అలాగే కలెక్టర్ హోదాలో ఉన్న వెంకట్రామిరెడ్డి స్వచ్చంధంగా పదవికి రాజీనీమా చేసి ఎమ్మెల్సీ అయ్యారు.
కాగా ఈ ఏదాడి జూన్‌తో ముగ్గురు రాజ్య సభ సభ్యుల స్ధానం ఖాళీ అవుతుంది.ఇందులో బండా ప్రకాష్ రాజీనామాతో ఒకటి, డీఎస్ లోక్ష్మీకాంతారావు పదవీకాలం జూన్‌తో ముగుస్తున్నందున ఒకటి ఇలా మొత్తంగా మూడు టీఆర్ఎస్ ఖాతాలోకే చేరనున్నాయి .కాగా అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు.ఒక స్థానంలో నటుడు ప్రకాష్‌రాజుతో భర్తీ చేయనున్నట్టు సమాచారం.
ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ప్రకాష్‌ను ఉపయోగించుకుంటాడనే ఊహాగానాలు సైతం వస్తున్నాయి.ఇందుకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌ను సీఎం కేసీఆర్ కలిసినప్పుడు ప్రకాష్‌రాజ్ ఉండడం నిదర్శనం.
అయితే జాతీయ రాజపకీయాలంటూ బిజీగా మారుతున్న కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో నిర్ణయాలు తీసుకుంటారు ? ఎప్పటిలోగా ఈ పదవుల ను భర్తీ చేస్తారనే ది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.