కేసీఆర్ కు సీఎం హెూదా సోనియమ్మ బిక్ష - పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం: కేసీఆర్ కు సీఎం హెదా కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ బిక్ష అని తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.ఆమె పెట్టిన బిక్షతోనే నేడు ఆ సీట్లో కూర్చొని అధికార మదాన్ని ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు.

 Kcr Cm Post Because Of Sonia Gandhi Says Ponguleti Srinivas Reddy, Kcr , Sonia G-TeluguStop.com

ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన ఐ ఎన్ టీ యూ సీ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ యూనియన్లో లేరనే నెపంతో తమ యూనియన్ ఆటో డ్రైవర్ల పై అధికార పార్టీ పెట్టే ఇబ్బందులు, వేధింపులను ఎదుర్కొనేందుకు కొత్తగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అధికార పార్టీ నేతల వేధింపులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అయ్యే ప్రతి ఖర్చు ఇక నుంచి పార్టీ తరుపున తానే భరిస్తానని తెలిపారు.

అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రి తరుపున 50శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను ఇస్తున్నట్లు ప్రకటించి వెంటనే వాటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అదేవిధంగా యూనియన్ లతో సంబంధం లేకుండా ప్రతి ఆటో డ్రైవర్కు పార్టీ తరుపున ఇన్సూరెన్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రక్రియ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.ఆటో డ్రైవర్ సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం ఆటో డ్రైవర్ సోదరులకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేయడంతో పాటు బీఆర్ఎస్ కెవీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామ చేసిన సత్తార్ మియాను, మరికొంత మంది బీఆర్ఎస్, ఇతర పార్టీల ఆటో యూనియన్ నాయకులను, ఆటో డ్రైవర్లను ఐ ఎన్ టీ యూ సీ కండువా కప్పి ఆహ్వానించారు.రాబోవు ఎన్నికల్లో ఫామ్ హౌస్ కే కల్వకుంట్ల కుటుంబం పరిమితం.

సమావేశ ప్రారంభానికి ముందు ప్రజా గాయకుడు గద్దర్ కు రెండు నిమిషాల పాటు నివాళ్లర్పించారు.అనంతరం జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో ఫామ్ హౌస్ కే కల్వకుంట్ల కుటుంబం పరిమితం అవ్వడం ఖాయమన్నారు.

Telugu Khammam, Sudheer, Telugudistricts-Telugu Districts

ఎన్నికలకు ముందే కేసీఆర్ కు ఆర్టీసీ ఉద్యోగులు, రైతులు గుర్తుకొచ్చారా అని ఎద్దేవా చేశారు.ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టి ఈ రెండిటిపైనే దృష్టిసారించడం విడ్డూరమన్నారు.రైతులకు రుణమాఫీ ప్రకటన చేసి తొమ్మిదేళ్లు దాటిందన్నారు.ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో వారిని దూషించిన ముఖ్యమంత్రి నేడు వారిపై కపట ప్రేమ చూపించడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇలా ఎన్నో హామీలను గాలికొదిలేశారని విమర్శించారు.రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆ విషయాన్ని కేసీఆర్ గ్రహించి ఎన్నికల స్టంట్ లను ప్రదర్శిస్తున్నాడని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు రెండు లక్షల రూపాయాల రుణమాఫీతో పాటు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందన్నారు.

ఐ ఎన్ టీ యూ సీ జిల్లా అధ్యక్షులు కొత్తా సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోరం కనకయ్య, ఖమ్మం డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, పార్టీ రాష్ట్ర నాయకురాలు బేబి స్వర్ణకుమారి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కార్పొరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలినేని నరేంద్ర, దొడ్డా నగేష్ యాదవ్, మలీదు జగన్, ఎం.డీ.ముస్తఫా, పల్లెబోయిన చంద్రయ్య, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, దుంపల రవికుమార్, మియాభాయ్, ఇమామ్ భాయ్, కొంగర జ్యోతిర్మయి, బోడా శ్రావణ్ కుమార్, కొప్పెర ఉపేందర్, ఐ ఎన్ టీ యూ సీ జిల్లా ప్రధాన కార్యదర్శి పమ్మి వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు, సిహెచ్.విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube