ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలివాల్సింది ప్రజలేనని తెలిపారు.
మంచి ప్రభుత్వం వస్తేనే మంచి జరుగుతుందని కేసీఆర్ చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
మ్యానిఫెస్టోలో పది హామీలు ఇస్తే వంద పనులు చేశామని పేర్కొన్నారు.ఈ క్రమంలో పైసలకు ప్రలోభపడి ఓటు వేయకూడదని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని విమర్శించారు.దళితబంధు ఎన్నికల కోసం తెచ్చింది కాదని తెలిపారు.
గతంలో వ్యవసాయం చేసే వారికి పిల్లను ఇచ్చేవారు కాదన్న కేసీఆర్ ఇప్పుడు పిల్లను ఇచ్చేటప్పుడు భూమి ఉందా అని అడుగుతున్నారని చెప్పారు.తెలంగాణలో భూములు రేట్లు పెరిగాయన్న కేసీఆర్ పోడు భూములకు సైతం పట్టాలు ఇచ్చామని తెలిపారు.