వెలుగుల పండుగ దీపావళి వేడుకలు( Diwali Celebrations ) అమెరికాలో ముందే ప్రారంభమయ్యాయి.ప్రవాస భారతీయులు, ఎన్ఆర్ఐ సంఘాలు దీపావళి కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
గత శనివారం రాత్రి న్యూయార్క్ నగర ఎగువ తూర్పు భాగం దీపావళి స్పూర్తితో వెలిగిపోయింది.ఆల్ దట్ గ్లిట్టర్స్ దీపావళి బాల్‌తో పండుగ సీజన్ ప్రారంభానికి సూచికగా పియరీ హోటల్.
( Pierre Hotel ) ‘‘క్రీమ్ డి లా క్రీమ్’’ ఈవెంట్‌ను నిర్వహించింది.ఈ కార్యక్రమంలో సౌత్ ఏషియన్ దేశాలకు చెందిన డయాస్పోరా పెద్ద సంఖ్యలో హాజరైంది.
వీరిలో వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.
పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి,( Indira Nooyi ) ఫ్యాషన్ డిజైనర్ ప్రబల్ గురుంగ్, ( Prabal Gurung ) అంజులా ఆచార్య వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై దీపావళి నాడు బాణాసంచా కాల్చడం, బహుమతులు , స్వీట్లు పంచుకోవడం వంటి సంగతులను గుర్తుచేసుకున్నారు.

గత కొన్నేళ్లుగా అమెరికాలో దీపావళి విశేష ఆదరణను , గుర్తింపును పొందుతున్న సంగతి తెలిసిందే.గతేడాది వైట్ హౌస్‌లో( White House ) జరిగిన గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.అలాగే 2024 నుంచి న్యూయార్క్ నగరంలోని( Newyork ) పాఠశాల సెలవుల జాబితాలో దీపావళికి చోటు దక్కింది.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్న ఈ డిమాండ్‌పై నిర్ణయాన్ని కలిసికట్టుగా తీసుకున్నట్లు ఈ ఏడాది జూన్‌లో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్( Newyork Mayor Eric Adams ) ప్రకటించారు.ఈ ఘటన నగరంలో పెరుగుతోన్న సాంస్కృతిక వైవిధ్యానికి ముఖ్యమైన గుర్తింపుగా విశ్లేషకులు చెబుతున్నారు.

దక్షిణాసియా వాసులు ముఖ్యంగా ప్రవాస భారతీయులు రెండు దశాబ్ధాలుగా చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లయ్యింది.ఇందుకోసం న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన జెనిఫర్ రాజ్‌కుమార్( Jenifer Rajkumar ) ఎంతో కృషి చేశారు.అయితే న్యూయార్క్‌లోని స్కూళ్లకు దీపావళి నాడు సెలవు ప్రకటించినప్పటికీ.ఈ ఏడాది మాత్రం అది అందుబాటులో వుండదు.ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ఆరంభమైన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి దీపావళి నాడు సెలవు అమల్లోకి రానుంది
.






