తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఈ క్రమంలో మ్యాజిక్ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలేలా ఉంది.భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో వెళ్తారనే వార్త వినిపిస్తోంది.ఈ మేరకు మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరే అవకాాశం ఉందని సమాచారం.
అయితే భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తెల్లం వెంకట్రావు విజయం సాధించారన్న సంగతి తెలిసిందే.







