ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే విషయం తెలిసిందే.అయితే తాజాగా ఆయన చేరికకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
దీంతో ఈనెల 16 లేదా 17వ తేదీన నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశాలలో కానీ, అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో కానీ తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు.అదేవిధంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న తుమ్మలకు సీటు విషయంలో కాంగ్రెస్ ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వకపోవడంతో తుమ్మల చేరిక అంశంపై కాస్త సందిగ్ధంలో ఉన్నారని సమాచారం.
కాగా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల లేట్ అవుతాయని వార్తలు జోరుగా సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ పై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనలో తుమ్మల ఉన్నారని తెలుస్తోంది.