హీరోయిన్ అనూ ఇమాన్యుయేల్( Anu Emmanuel ) మలయాళం సినిమాలతో తన సినీ కెరీర్ ప్రారంభించింది.మజ్ను, కిట్టుగాడు ఉన్నాడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా మజ్ను పెట్టిన బడ్జెట్‌కు మూడు రెట్ల కంటే ఎక్కువ వసూలు సాధించి సూపర్ హిట్ అయింది.కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా కూడా కామెడీ వల్ల బాగానే ఆడింది.
ఆ తర్వాత ఆమె చేసిన ప్రతి తెలుగు సినిమా డిజాస్టర్ కు కేరాఫ్ అడ్రస్ గా మారాయి.ఆమె నటించిన ఆక్సిజన్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, శైలజ రెడ్డి అల్లుడు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌గా నిలిచాయి.
ఆపై ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన రీసెంట్ సినిమాలూ ఊహించని రీతిలో బొక్క బోర్లా పడ్డాయి.
రవితేజ హీరోగా చేసిన రావణాసుర సినిమా( Ravanasura )లో అనూ ఇమాన్యుయేల్ నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా ఎంత చెత్తగా ఆడిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.ఇక ఈ అమ్మడు తన ఐరన్ లెగ్ తో కార్తీకి కూడా పెద్ద ఫ్లాప్ ఇచ్చింది.
కార్తీ హీరోగా ఇటీవల జపాన్ సినిమా( Japan Movie ) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఆ మూవీలో అనూ హీరోయిన్ రోల్ చేసింది.కామెడీ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఆమెను ఎందుకు తీసుకున్నారో కూడా సగటు ప్రేక్షకుడికి అర్థం కాలేదు.ఎందుకంటే సినిమాలో ఆమె పాత్రకు కొంచెం కూడా ప్రాధాన్యం లేదు.
ఆటలో అరటిపండు లాగా ఆమె పాత్రను డైరెక్టర్ డిజైన్ చేశాడు.
నిజానికి ఈ సినిమా కథ కూడా బాగాలేదు.మిగతా పాత్రలను కూడా డైరెక్టర్ సరిగా రాసుకోలేదు.ఇందులో అన్ని “అతి” అనిపించే సన్నివేశాలే ఉన్నాయి.
ఇది ఫెయిల్ కావడానికి బహుశా అదే కారణం కావచ్చు.కానీ అభిమానులు మాత్రం అనూ ఇమాన్యుయేల్ ను తీసుకోవడం వల్లే సినిమా ఔట్ పుట్ ఇలా తగలడిందని కామెంట్లు చేస్తున్నారు.
ఆమెను ఎప్పుడైతే హీరోయిన్ గా అనుకున్నారో అప్పుడే హీరో, డైరెక్టర్, నిర్మాతకు బ్యాడ్ టైమ్ మొదలైనట్లు ఉందని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏమైనా అందరికీ వరుసగా హిట్స్ రావాలని లేదు కానీ అనూకు మాత్రం చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాపే అవుతోంది.
సినిమా స్క్రిప్ట్‌లను సెలెక్ట్ చేసుకోవడంలో ఆమె చేస్తున్న తప్పులే అందుకు కారణమని తెలుస్తోంది.ఏది ఏమైనా మనోళ్లు సెంటిమెంటు ఎక్కువ నమ్ముతుంటారు.
అందువల్ల ఆమెకు భవిష్యత్తులో హీరోయిన్గా అవకాశాలు ఇచ్చే ధైర్యం చేయకపోవచ్చు.