సరిగ్గా పాయింట్‌ చూసి వైసీపీ మీద బీజేపీ దాడి!

రాజకీయాలంటే అంతే.ఇక్కడ శాశ్వత మిత్రులు.

 Kanna Lakshminarayana Tweet About Ys Jagan-TeluguStop.com

శాశ్వత శత్రువులు ఉండరంటారు.ఎన్నికల ముందు తనకు మిత్రులుగా ఉన్న వాళ్ల నుంచే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.

ఓవైపు కేసీఆర్‌తో స్నేహం దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే కనిపిస్తోంది.కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దని, పోలవరం విషయంలో తెలంగాణ తప్పుదోవ పట్టిస్తోందని సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌ వాదించడం చూస్తుంటే కేసీఆర్‌తో జగన్‌ సంబంధాలు ఏ స్థాయిలో దెబ్బ తిన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇటు బీజేపీ కూడా జగన్‌తో అదే రేంజ్‌లో ఆడుకుంటోంది.

ఎప్పుడు చాన్స్‌ దొరుకుతుందా.

ఎప్పుడు జగన్‌ను ఇరికిద్దామా అని చూస్తున్నట్లు కనిపిస్తోంది.కేసీఆర్‌ కలిసి తిరగడంపైనే జగన్‌పై కేంద్ర బీజేపీ పెద్దలు గుర్రుగా ఉన్నారు.

అప్పటి నుంచే జగన్‌పై దాడిని తీవ్రం చేశారు.ఇప్పుడు ఆ దాడిని మెల్లగా హిందుత్వ వైపు మళ్లించారు.

ఇప్పటికే ఆలయాల్లో అన్యమత ప్రచారం, అన్యమత ఉద్యోగులు, ఇమామ్‌, పాస్టర్లకు వేతనాల అంశంపై జగన్‌ను ఇరుకున పెట్టిన బీజేపీ.తాజాగా మరో అంశాన్ని లేవనెత్తింది.

Telugu Chandrababu, Janasena, Nagababu, Pawankalyan, Ys Jagan, Ysrcp-Telugu Poli

ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుస ట్వీట్లతో జగన్‌ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు.రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది.బడిని, గుడిని వదలని వైసీపీ వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంద్రధనస్సుకి కూడా రంగులేసేలా ఉన్నారంటూ ఓ ట్వీట్‌తో సెటైర్‌ వేశారు.అన్నవరంలో అన్యమత ప్రచారం, భవాలీ ఐలాండ్‌లో ఆర్చిపై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవ్‌లో మతపరమైన స్టాల్స్‌ ఏర్పాటు వైసీపీ మతవ్యాప్తిని సూచిస్తున్నాయి అంటూ విమర్శించారు.

విజయవాడ దుర్గమ్మ గుడి దిగువన ఉన్న బెరం పార్క్‌కు శిలువతో కూడిన ఏసుక్రీస్తు, మరియామాత బొమ్మలు వేయడాన్ని కూడా ప్రస్తావించారు.

టీడీపీ నుంచి ఇలాంటి విమర్శలు వస్తే అంతెత్తున లేచే వైసీపీ వాళ్లు.

విచిత్రంగా బీజేపీ విషయంలో మాత్రం ఏమీ స్పందించడం లేదు.ఆ పార్టీపై ఎదురు దాడికి దిగితే ఢిల్లీ పెద్దల నుంచి తిప్పలు తప్పవన్న ఆందోళన వైసీపీ వాళ్లలో కనిపిస్తోంది.

అందుకే కమలనాథులు తమపై సెటైర్లు వేసినా, విమర్శలు చేసినా వాళ్లతో స్నేహానికే వైసీపీ ఆరాటపడుతోంది.ఈ మధ్య కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కూడా ఎలా మర్యాదలు చేశారో చూశాం.

ఇప్పుడు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న మత ప్రచారం పెద్ద ఎత్తున డ్యామేజీ చేసే అవకాశం ఉన్నా.వైసీపీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube